బాలాపూర్ ఎఎస్ఐ సూసైడ్: సీఐ సహా ఐదుగురిపై కేసు

Published : Dec 04, 2019, 10:35 AM ISTUpdated : Dec 04, 2019, 10:42 AM IST
బాలాపూర్ ఎఎస్ఐ సూసైడ్:  సీఐ సహా ఐదుగురిపై కేసు

సారాంశం

బాలాపూర్ ఎఎస్ఐ  నరసింహులు ఆత్మహథ్య కేసులో ఐదుగురు పోలీసులపై కేసు నమోదు చేశారు. బాధిత  కుటుంబ సభ్యులు పోలీసుల వేధింపుల గురించి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్:  బాలాపూర్ ఎఎస్ఐ నరసింహులు ఆత్మహత్య కేసులో ఐదుగురు పోలీసులపై  కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే తనను బదిలీ చేశారని  మనోవేదనకు గురైన నరసింహులు ఆత్మహత్యాయత్నం చేసుకొన్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన  మృతి చెందాడు.

బాలాపూర్ ఎఎస్ఐ నరసింహులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 2వ తేదీన మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసు శాఖ తీరుపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని కుటుంబసభ్యులు ఆరోపించారు. బాలాపూర్ ఎఎస్ఐ  నరసింహులు ఆత్మహత్య కేసులో  ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

బాలాపూర్ సీఐ సైదులు, ఎస్ఐ వెంకట్ రెడ్డి, కానిస్టేబుళ్లు  దశరథ, జలంధర్, శ్రీశైలం కేసు నమోదు చేశారు. 

బాలాపూర్ ఎఎస్ఐ నర్సింహులు డిఆర్‌డిఓ అపోలో ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ డిసెంబర్ రెండో తేదీన ఉదయం మృతి చెందాడు. ఇన్స్ పెక్టర్ వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఎఎస్ఐ నర్సింహులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.

Also read:ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలాపూర్ ఎఎస్ఐ నరసింహులు మృతి

ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని బాలాపూర్ పీఎస్ లో చోటు చేసుకుంది. బాలాపూర్ పీఎస్ లో నరసింహా ఎఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవలే ఏఎస్సై నరసింహాను బాలాపూర్ పీఎస్ నుంచి మంచాల పీఎస్ కు బదిలీ చేశారు. 

స్థానిక ఇన్స్ పెక్టర్ వేధింపులకు పాల్పడుతున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోనే తనను బదిలీ చేశారని ఎఎస్ఐ నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గత నెల 22వ తేదీన నరసింహులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Also read:బదిలీ చేసిన సీఐపై ఆగ్రహం: పెట్రోల్ పోసుకుని ఏఎస్సై ఆత్మహత్యాయత్నం

అయితే బదిలీపై వెళ్లడం ఇష్టం లేని నరసింహా తన బదిలీని నిలిపివేయాలంటూ సీఐను కోరాడు. అయితే ఆయన అంగీకరించకపోవడంతో బాలాపూర్ పీఎస్ సమీపంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

తన బదిలీకి సీఐ సైదులే కారణమంటూ ఆరోపించారు. గాయపడిన ఏఎస్సై నరసింహాను తోటి ఉద్యోగులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. 30శాతం గాయాలపాలైన ఏఎస్సై నరసింహా అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చేర్పించారు. 

ఇకపోతే ఏఎస్సై నరసింహా అంతకు ముందు మేడ్చల్ పీఎస్ లో పనిచేసినట్లు తెలుస్తోంది. సీఐ సైదులు తనను వేధిస్తున్నారంటూ ఏఎస్సై నరసింహా పదేపదే ఆరోపించేవారని తోటి ఉద్యోగులు గుర్తు చేసుకొంటున్నారు.

తప్పుడు ఫిర్యాదుల ఆధారంగానే సీఐ తనను వేధించాడని ఎఎస్ఐ నరసింహులు ఆరోపించారు. అందువల్లే తనపై బదిలీ వేటు వేశారని ఆరోపించారు. 

తన బదిలీని నిలిపివేయావని ఎన్నిసార్లు కోరినా వినలేదని మదనపడుతున్న నరసింహా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను ఎలా నమ్ముతారంటూ ఏఎస్సై నరసింహా తలచుకుని పదేపదే ఆవేదన వ్యక్తం చేసేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  

 

 

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu