
హైదరాబాద్: Dalitha Bandhu పథకం హుజూరాబాద్ లో నిలిపివేయడంలో రాజకీయ కుట్ర ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.సోమవారం నాడు రాత్రి తెలంగాణ రాష్ట్ర మంత్రి koppuala Eshwar కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు.
also read:దళితబంధు: నాలుగు మండలాలకు రూ. 250 కోట్ల నిధులు విడుదల
ఈ పథకం నిలిపివేయడం ద్వారా దళిత సమాజానికి జరిగిన ద్రోహంగా భావించాలన్నారు.ఈ బడ్జెట్ లోనే దళితబంధు పథకాన్ని నిధులను కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని Bjp నేతలు ఎందుకు లేఖ రాశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం తీసుకురాలేదని ఆయన తేల్చి చెప్పారు.
ఈ పథకాన్ని నిలిపివేసేలా చేసి మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దళితబంధు పథకాన్ని నిలిపివేసినందుకు గాను ఈటల రాజేందర్ బాధ్యత వహించాలన్నారు. రాజకీయ ప్రోద్బలంతోనే ఈసీ నిర్ణయం తీసుకొన్నట్టుగా కన్పిస్తోందని ఆయన విమర్శించారు. దళితబంధును నిలిపివేసి పేదల పొట్టకొట్టారన్నారు. చరిత్రలో ఏనాడూ కూడ ఆన్‌గోయింగ్ స్కీమ్ ను నిలిపివేయలేదని ఆయన గుర్తు చేశారు.
హుజూరాబాద్ లో దళితబంధుకు బ్రేక్ పడింది. ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని ఈసీ నిర్ణయం తీసుకొంది.దళితబంధు పథకంపై అందిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకొంది.హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ పథకాన్ని అధికార పార్టీ ఉపయోగించుకొంటుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ విషయమై బీజేపీనేతలతో పాటు హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొందరు Election commission కి ఫిర్యాదు చేశారు.ఈ పిర్యాదుపై విచారణ నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ పథకాన్ని ఉప ఎన్నిక ముగిసే వరకు నిలిపివేయాలని ఆదేశించింది. దళితబంధు పథకాన్ని ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.