రాష్ట్రంలోని నాలుగు మండలాలకు రూ. 250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.ఈ మేరకు ఆర్ధిక శాఖ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో ‘దళిత బంధు’ పథకానికి రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం నాడు విడుదల ఉత్తర్వులు జారీ చేశారు.
also read:కేసీఆర్‌కి ఈసీ షాక్: హుజూరాబాద్‌లో దళితబంధుకి బ్రేక్
undefined
ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి రూ.100 కోట్లు, సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండలానికి రూ.50 కోట్లు, నాగర్‌కర్నూలు జిల్లా చారగొండ మండలానికి రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలానికి రూ.50 కోట్లు విడుదల చేశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో Dalithabandhu పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది..ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. Huzurabad bypoll ఉపఎన్నిక తర్వాత దళితబంధును యధావిథిగా కొనసాగించవచ్చని సూచించింది.
రాఁష్ట్ర వ్యాప్తంగా దళిబంధు పథకాన్ని అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే దళిత వ్యతిరేకులు ఈ పథకంపై ఈసీకి ఫిర్యాదు చేసి హుజూరాబాద్ లో ఈ పథకం అమలు కాకుండా నిలిపివేసేలా ఆదేశాలిచ్చారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఈ ఏడాది ఆగష్టు 16న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఎన్నికలను పురస్కరించుకొనే తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు దళితులతో పాటు బీసీ, ఈబీసీలకు కూడా ఇదే తరహాలో పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.