మీకు నూకలు ఎప్పుడో చెల్లాయి: అమిత్ షా కు హరీష్ రావు కౌంటర్

By narsimha lode  |  First Published Aug 27, 2023, 8:06 PM IST

ఖమ్మం సభలో  బీఆర్ఎస్ పై  అమిత్ షా విమర్శలకు మంత్రి హరీష్ రావు  కౌంటరిచ్చారు.


హైదరాబాద్: ఖమ్మం సభలో  బీఆర్ఎస్ పై  కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా చేసిన విమర్శలపై  మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ పాలనకు  నూకలు  చెల్లాయని  అమిత్ షా చేసిన విమర్శలను మంత్రి హరీష్ రావు ప్రస్తావించారు.

also read:వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్: ఖమ్మంలో కేసీఆర్ పై అమిత్ షా ఫైర్

Latest Videos

తమకు నూకలు చెల్లడం కాదు...తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని మంత్రి హరీష్ రావు  తేల్చి చెప్పారు.బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసునని మంత్రి హరీష్ రావు  చెప్పారు. ఇలాంటి మీరా  కుటుంబ పాలన గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.

 

మాకు నూకలు చెల్లడం కాదు..
తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి

బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడడం…

— Harish Rao Thanneeru (@BRSHarish)

కార్పోరేట్  సంస్థల కోసం తీసుకు వచ్చిన  మూడు రైతు చట్టాలను నిరసిస్తూ  రైతులు ఆందోళన చేస్తే  బీజేపీ తోకముడిచిన విషయాన్ని హరీష్ రావు విమర్శలు చేశారు.కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన మీదని బీజేపీ సర్కార్ పై హరీష్ రావు  విమర్శలు చేశారు.సీఎం పదవి  కాదు.. ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని  బీజేపీకి హితవు పలికారు.

click me!