
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ఆంధ్రప్రదేశ్ ఇష్యూ ముందుకు వచ్చింది. అమిత్ షా సభకు హాజరైన కొందరు సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ అనే ప్లకార్డులను ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. ఖమ్మం సభలో టీటీడీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్లకార్డులు అమిత్ షా సభలో కనిపించడం గమనార్హం.
తెలంగాణ బీజేపీ ఈ రోజు ఖమ్మంలో రైతు గోస - బీజేపీ భరోసా సభ నిర్వహించింది. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు అమిత్ షా వచ్చారు. ఏపీ బీజేపీ నేతలు ఆయనకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జీ పాతూరి నాగభూషణం, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్ తదితరులు అందులో ఉన్నారు.
గన్నవరం నుంచి ఆయన ఖమ్మం చేరుకున్నారు. సాయంత్రం అమిత్ షా మాట్లాడారు. సభలో కేసీఆర్ పై విమర్శలు సంధించారు.
Also Read: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్: ఖమ్మంలో కేసీఆర్ పై అమిత్ షా ఫైర్
కేసీఆర్ సర్కార్ ను గద్దె దింపాలా వద్దా బీజేపీ సర్కార్ కావాలా వద్దా అని అమిత్ షా ఖమ్మం ప్రజలను ప్రశ్నించారు. తిరుపతి వెంకటేశ్వరుడిని స్మరించుకొని ప్రసంగం ప్రారంభిస్తానని అమిత్ షా చెప్పారు.స్థంభాద్రి లక్ష్మీ నరసింహుని సర్మించుకుని ప్రసంగించనున్నట్టుగా తెలిపారు.