రాష్ట్రంలోని ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు.ఈ స్థానాల్లో విపక్షాలు నామ మాత్రంగా ప్రభావాన్ని చూపాయి. ఈ స్థానాల్లో విపక్షాలు సరైన వ్యూహాంతో ముందుకెళ్తే టీఆర్ఎస్ కు కొంత ఇబ్బంది జరిగేదనే అభిప్రాయాలు లేకపోలేదు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో trs అభ్యర్ధులు విజయం సాధించారు.Telangana Local Body Electionలో విపక్షాలు ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దింపిన స్థానాల్లో కూడా అధికార పార్టీ సాధించిన ఓట్లలో సగం ఓట్లను కూడా పొందలేకపోయాయి. టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్ధులు కూడా ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేదు.రాష్ట్రంలోని 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రరెడ్డి, శంభీపూర్ రాజు, నిజామాబాద్ నుండి కవిత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డి, వరంగల్ జిల్లా నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లోని ఒక్కొక్క స్థానానికి, కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాలకు ఎన్నికలు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి.
also read:Nalgonda Local body MLC Election: టీఆర్ఎస్ అభ్యర్ధి కోటిరెడ్డి ఘన విజయం
undefined
నల్గొండ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎంసీ కోటిరెడ్డి బరిలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే నగేష్ ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేశారు. అయితే విపక్షాలన్నీతనకు మద్దతు ఇస్తాయని ఆయన ప్రకటించారు. కానీ నల్గొండ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధి కోటిరెడ్డి 691 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నగేష్ కి 226 ఓట్లు మాత్రమే లభించాయి. విపక్షాలు మద్దతు ప్రకటించినా కూడా నగేష్ కు 250 ఓట్లు కూడా రాలేదు. గతంలో ఈ స్థానం నుండి Congress అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ స్థానానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి సతీమణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డికి బదులుగా ఏంసీ కోటిరెడ్డికి టీఆర్ఎస్ నాయకత్వం ఈ దఫా టికెట్ ఇచ్చింది.
Khammam స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా తాతా మధు పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా రాయల నాగేశ్వర్ రావు పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధుకు 480 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ధి రాయల నాగేశ్వర్ రావుకి 242 ఓట్లు మాత్రమే వచ్చాయి. karimnagar జిల్లాలోని రెండు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ భానుప్రసాదరావుకు 584 ఓట్లు, ఎల్ రమణకు 479 ఓట్లు వచ్చాయి. ఈ స్థానం నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన రవీందర్ సింగ్ కు 231 ఓట్లు దక్కాయి. రవీందర్ సింగ్ టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. పార్టీ నాయకత్వం ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు.రవీందర్ సింగ్ బరిలోకి దిగడంతో టీఆర్ఎస్ పార్టీ తమ ప్రజా ప్రతినిధులను క్యాంప్‌లకు తరలించింది. Medak లో టీఆర్ఎస్ అభ్యర్ధి ఒంటేరు యాదవ రెడ్డి విజయం సాధించారు.ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భార్య నిర్మలా జగ్గారెడ్డి బరిలో నిలిచారు. యాదవ రెడ్డికి 762 ఓట్లు, నిర్మలా జగ్గారెడ్డికి 238 ఓట్లు వచ్చాయి. తమ పార్టీకి ఉన్న ఓట్లను జగ్గారెడ్డి సతీమణి దక్కించుకొన్నారు.
Adilabad స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి దండె విఠల్ విజయం సాధించారు. 742 ఓట్లతో విఠల్ విజయం సాధించారు. ఈ స్థానం నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధి బరిలో నిలిచారు. అయితే ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ కే బలం ఉంది. అయితే ఆయా స్థానాల్లో బరిలో ఉన్న ఇండిపెండెంట్లకు ఓట్లను రాబట్టడంలో విపక్షాలు సరైన వ్యూహాన్ని అనుసరించలేకపోయాయి.బలం లేకున్నా కూడా గతంలో నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ స్థానం నుండి ఈ దఫా పోటీ చేసే విసయంలో ఆ పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే విపక్షాలు ఏకతాటిపై నిలబడి వ్యూహారచనతో ముందుకు వెళ్తే టీఆర్ఎస్ విజయాన్నిఆపలేకపోయినా కొంత ఆ పార్టీకి ముచ్చెమటలు పోయించే అవకాశాలు ఉండేవనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.