కాలి గాయంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్ వాట్సాప్ 24 గంటల్లో మూడుసార్లు బ్లాక్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆరే ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాట్సప్ అకౌంట్ బ్లాక్ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘వాట్సాప్ ఆగిపోయింది. నిన్నటి నుంచి మూడుసార్లు వాట్స్అప్ సేవలు నిలిచిపోయాయి. ఎనిమిది వేల కంటే ఎక్కువ మెసేజ్‌లు వచ్చాయి. వీలైనన్ని ఎక్కువ మెసేజ్‌లకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ క్రమంలోనే మూడుసార్లు నా వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది. గత 24 గంటలుగా వాట్సప్ అకౌంట్ పనిచేయడం లేదు. డిజిటల్ సవాళ్లు చాలా క్లిష్టంగా ఉంటాయి’ అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా ఎడమ కాలి వేలికి గాయం కావడంతో కేటీఆర్ ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే కేటీఆర్ ఆరోగ్య సమాచారం కోసం బంధు మిత్రులు, టిఆర్ఎస్ శ్రేణులు ఆయన వాట్సాప్ కు మెసేజ్ పంపుతున్నారు. ఆ మెసేజ్ లతో ఫ్లో ఎక్కువై వాట్సాప్ ఖాతా నిలిచి పోయినట్లు తెలుస్తోంది. మరోవైపు కాలికి దెబ్బ తగిలిన విశ్రాంతి తీసుకుంటూ ఇంటి నుంచే పని చేస్తున్నానని తెలిపారు కేటీఆర్. వర్క్ ఫ్రం హోం అంటూ ట్వీట్ చేశారు.
undefined
మంత్రి కేటీఆర్ కాలికి గాయం.. మూడు వారాలు రెస్ట్‌లోనే
ఇదిలా ఉండగా, జులై 23న మహేంద్ర యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శనివారం ఉదయం ప్రగతి భవన్ నుంచి బయలుదేరుతుండగా కేటీఆర్ కాలు మెలిక పడింది. దీంతో నొప్పిని భరిస్తూనే ఆయన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద మహీంద్రాతో కలిసి అక్కడే భోజనం చేశారు. అయితే నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో ఎడమ కాలి చీలమండలో చీలిక ఏర్పడినట్లు గుర్తించిన వైద్యులు మూడువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్ కు సూచించారు. తాను గాయపడిన విషయాన్ని మంత్రి ట్విటర్ ద్వారా స్వయంగా ప్రకటించారు.
దీని మీద వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల స్పందిస్తూ కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతే కాదు విశ్రాంతి సమయంలో ఓటీటీలో మంచి సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటే చెప్పాలని కేటీఆర్‌కు షర్మిల సెటైర్లు వేశారు. మీకోసం కుట్ర సిద్ధాంతం, cloudburst, నీటమునిగిన ఇల్లు, పంపు హౌస్ లు ఉన్నాయని ఆమె అన్నారు. కాగా, కేటీఆర్ గాయపడిన విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు.