Telangana Inter: తెలంగాణ ఇంటర్ బోర్డ్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించింది. మే 22 నుంచి 29 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షల ఫలితాలను tgbie.cgg.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో ఇటీవల ప్రకటించింది. ఇప్పటికే సప్లిమెంటరీ పరీక్షల తేదీలు పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని కూడా ప్రకటించింది. అయితే.. ఒకటి లేదా రెండు సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. గత సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 2, 2024 వరకు జరిగాయి. పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 25న ప్రారంభమైంది మరియు ఫలితాలు జూన్‌లో విడుదల చేశారు.
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మార్చి 6 నుంచి మార్చి 25 వరకు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 5న ప్రారంభమవగా, రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 6న ప్రారంభమయ్యాయి. ఫలితాలు ఏప్రిల్ 24న ప్రకటించారు. ఈ సంవత్సరం తొలి ఏడాది విద్యార్థులలో 66.89% మంది ఉత్తీర్ణులయ్యారు, రెండో ఏడాది 71.37% ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు 2025లో బాలికలు మరోసారి అబ్బాయిల కంటే మెరుగ్గా రాణించారు. పరీక్షలకు హాజరైన 5,08,582 మంది విద్యార్థులలో 74.21% మంది బాలికలు ఉత్తీర్ణులైతే, 57.31% మంది అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. మొదటి ఏడాది పరీక్షలు రాసిన 4,88,430 మంది విద్యార్థులలో 73.83% మంది అమ్మాయిలు ఉత్తీర్ణులయ్యారు, బాలురు 57.83% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. రెండేళ్లలో అమ్యాయిల ఉత్తీర్ణత అధికంగా ఉంది.
ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ (ఉదయం 9 గంటల నుంచి 12 వరకు)
మే 22 (గురువారం)... సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
మే 23 (శుక్రవారం) ... ఇంగ్లీష్ పేపర్ -1
మే 24 (శనివారం)... మాథ్స్ పేపర్ -1ఏ/ బోటనీ పేపర్ -1/ పొలిటికల్ సైన్స్ పేపర్-1
మే 25 (ఆదివారం)... మాథ్స్ పేపర్ - 1బీ/ జువాలజీ పేపర్ -1/ హిస్టరీ పేపర్-1
మే 26 (సోమవారం)... ఫిజిక్స్ పేపర్- 1/ఎకానమిక్స్ పేపర్- 1
మే 27 (మంగళవారం)... కెమిస్ట్రీ పేపర్- 1 / కామర్స్ పేపర్ 1
మే 28 (బుధవారం)... పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ - 1 / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -1(బైపీసీ విద్యార్థులకు)
మే 29 (గురువారం)... మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్- 1/జియోగ్రఫీ పేపర్- 1
ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇలా.. ( పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు)
మే 22 (గురువారం)... సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
మే 23 (శుక్రవారం) ... ఇంగ్లీష్ పేపర్ -2
మే 24 (శనివారం)... మాథ్స్ పేపర్- 2ఏ/ బోటనీ పేపర్ -2/ పొలిటికల్ సైన్స్ పేపర్-2
మే 25 (ఆదివారం)... మాథ్స్ పేపర్- 2బీ/ జువాలజీ పేపర్ - 2/ హిస్టరీ పేపర్-2
మే 26 (సోమవారం)... ఫిజిక్స్ పేపర్- 2/ఎకానమిక్స్ పేపర్-2
మే 27 (మంగళవారం)... కెమిస్ట్రీ పేపర్ -2 / కామర్స్ పేపర్-2
మే 28 (బుధవారం)... పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2 / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -2(బైపీసీ విద్యార్థులకు)
మే 29 (గురువారం)... మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2/జియోగ్రఫీ పేపర్-2