తెలంగాణ ఇంటర్‌మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. తొలి ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణత 66.89 శాతం, రెండో ఏడాది 71.37 శాతం మంది పాసైనట్లు భట్టి విక్రమార్క తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది పెరిగిందన్నారు. . దీంతోపాటు ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలదే హవా కొనగిందని అన్నారు.
తెలంగాణ ఇంటర్‌మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. తొలి ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణత 66.89 శాతం, రెండో ఏడాది 71.37 శాతం మంది పాసైనట్లు భట్టి విక్రమార్క తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది పెరిందన్నారు. దీంతోపాటు ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిదే హవా కొనగిందని అన్నారు.
ఈ జిల్లాలు టాప్‌లో నిలిచాయి.
ఇంటర్ సెకెండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లా టాప్‌లో నిలిచింది. రెండో స్థానంలో ఆసిఫాబాద్ నిలిచింది. ఇక మొదటి సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్‌లో నిలిచింది. రెండో స్థానంలో కొమురం భీం ఆసిఫాబాద్ నిలిచింది. తొలి ఏడాదిలో మేడ్చల్ జిల్లా 77.21 శాతంతో ఫస్ట్ ప్లేస్, చివరి స్థానంలో 48.43 శాతంతో మహబూబాబాద్ చివరి స్తానంలో నిలిచింది. రెండో ఏడాది ఇంటర్‌లో ములుగు జిల్లా 80.12 శాతంతో టాప్‌లో ఉంది. చివరి స్థానంలో కామారెడ్డి జిల్లా 54.93 శాతంతో పరిమితమైంది. ఇక ఇంటర్ తొలిఏడాది బాలికలు 73 శాతం, సెకండియర్‌లో 77.73 శాతం మంది పాసయ్యారు.
సీఎం రేవంత్ శుభాకాంక్షలు...
ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మరింత ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక సీఎం రేవంత్ ఈరోజు జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా ట్విట్టర్‌లో విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.
మే 22 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు...
వచ్చే నెల 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఇంటర్ బోర్డు వారం గడువు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇంటర్ మొదటి, రెండో ఏడాది కలిపి మొత్తం 9,97,012 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.