Weather : తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్... ఈ రెండ్రోజులు అస్సలు బయటకు రాకండి

Published : Apr 23, 2025, 10:51 PM IST
Weather : తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్... ఈ రెండ్రోజులు అస్సలు బయటకు రాకండి

సారాంశం

తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసారు... ఈ రెండ్రోజులు ఈ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. ఆ జిల్లాలేవో తెలుసా?

Telangana Weather : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వేసవికాలం మొదలైనప్పటి నుండి వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం కాస్త చల్లగానే ఉంది. కానీ ఇప్పుడు వర్షాలు కురవడం ఆగిపోయింది... దీంతో భానుడి భగభగలు పెరిగాయి. ఉదయమే ఎండలు సుర్రుమంటున్నాయి... ఇక మధ్యాహ్నం బయటకు వచ్చే పరిస్థితి ఉండటంలేదు. ఈ రెండ్రోజులు (ఏప్రిల్ 24, 25) ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందని... తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

తెలంగాణలోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ : 

తెలంగాణవ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది... కానీ ఓ తొమ్మిది జిల్లాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.   ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసారు. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని... పగటిపూట బయటకు రావద్దని సూచిస్తున్నారు. 

ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... రానున్న రెండ్రోజులు ఈ జిల్లాలోని ప్రాంతాలు నిప్పుల కుంపటిలా మారతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురు, శుక్రవారం ఇక్కడ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశాలున్నాయని ప్రకటించారు. ఒక్క ఈ జిల్లాలోనే కాదు  ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఈ 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 

ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అంటే ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దగ్గరగా నమోదయ్యే అవకాశాలున్నాయన్నమాట. వడగాలులు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని హెచ్చరించారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్