నిజామాబాద్ లో జరిగిన రైతు మహోత్సవంలో హెలికాప్టర్ అనుకోకుండా జనం మధ్యలో దిగడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కొందరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి, కానీ మంత్రులు, ప్రజలు సురక్షితంగా ఉన్నారు.
Telangana : తెలంగాణ మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. భద్రతా అధికారుల వైఫల్యమే లేక పైలట్ నిర్లక్ష్యమో తెలీదుగానీ ఎక్కడో మైదానంలో దిగాల్సిన హెలికాప్టర్ నేరుగా జనాల మధ్యలో దిగింది. దీంతో హెలికాప్టర్ లోని మంత్రులే కాదు ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. హెలికాప్టర్ ఎక్కడ మీదపడుతోందని భయపడిపోయిన ప్రజలు పరుగు తీసారు. ఈ ఘటనలో మంత్రులు, ప్రజలు సురక్షితంగా బైటపడ్డారు... కానీ కొందరు పోలీసులు మాత్రం స్వల్పంగా గాయాలపాలయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్ లో ''రైతు మహోత్సవ' కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులు ఇందులో పాల్గొంటారు... ఏప్రిల్ 21 నుండి 23 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. వ్యవసాయాన్ని మరింత ఈజీ చేసేందుకు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంపై వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారులు, విశ్వవిద్యాలయాల సిబ్బంది రైతులకు అవగాహన కల్పిస్తారు.
ఈ రైతు మహోత్సవ కార్యక్రమం ప్రారంభం నేపథ్యంలో తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్ విచ్చేసారు. ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ కు చేరుకున్న వీరు ముందుగా కలెక్టరేట్ కు వెళ్లాల్సి ఉంది... అక్కడే హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేసారు. కానీ అధికారులు, పైలట్ మధ్య సమన్వయ లోపంతో హెలికాప్టర్ నేరుగా రైతు మహోత్సవ వేడుకలు జరిగే గిరిరాజ్ కళాశాల మైదానానికి చేరుకుంది. అక్కడే ల్యాండింగ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు.
అయితే ఈ హెలికాప్టర్ కిందకుదిగే సమయంలో వీచే భారీ గాలికి రైతు మహోత్సవం కార్యక్రమంలో గందరగోళం ఏర్పడింది. మైదానంలో భారీగా దుమ్ము రేగడంతో పాటు స్వాగత వేదిక కూలిపోయింది. ఏం జరుగుతుందో అర్థంకాక ఈ కార్యక్రమానికి వచ్చినవారు పరుగుతీసారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు మైదానంలోని ప్రజలకుగానీ, హెలికాప్టర్ లోని మంత్రులకు గానీ ఎలాంటి ప్రమాదం జరక్కుండా చూసారు. ఈ క్రమంలోనే కొందరు పోలీసులకు గాయాలయ్యాయి.
ఈ హెలికాప్టర్ గాలికి రైతుల కోసం ఏర్పాటుచేసిన స్టాళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరక్కుండా అధికారులు జాగ్రత్త పడాలని... సమన్వయంతో పనిచేయాలని ఉన్నతాధికారులు సూచించారు. మంత్రులు కూడా ప్రమాదం నుండి సురక్షితంగా బైటపడి రైతు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతిదానికీ హెలికాప్టర్ కావాలి
అంటే ఇలానే అవుతుంది మరి..
నిజామాబాద్, రైతు మహోత్సవం కార్యక్రమం కోసం హాజరవడం కోసం హెలికాప్టర్ లో వచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు
ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి స్వాగత వేదిక కూలి పలువురు పోలీసులకు… pic.twitter.com/KV7rgDI1Df