Hyderabad: తప్పుడు సమాచార వ్యాప్తిపై తెలంగాణ హోంమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు సమర్ధవంతంగా పని చేస్తున్నారనీ, నేరాలను తగ్గించడంతోపాటు అనేక వినూత్న పౌర కేంద్రీకృత పథకాలు, సంస్కరణలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు.
Telangana home minister Mahmood Ali: తప్పుడు సమాచార వ్యాప్తిపై తెలంగాణ హోంమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పోలీసుల పనితీరుపై ప్రభావం చూపుతున్నదని అన్నారు. తెలంగాణ పోలీసులు సమర్ధవంతంగా పని చేస్తున్నారనీ, నేరాలను తగ్గించడంతోపాటు అనేక వినూత్న పౌర కేంద్రీకృత పథకాలు, సంస్కరణలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు.
వివరాల్లోకెళ్తే.. తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ షేరింగ్ వ్యాప్తి పెరుగుతుండటంపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రెచ్చగొట్టే సందేశాలు, ద్వేషపూరిత కంటెంట్‌లు విపరీతంగా షేర్ అవుతున్నాయనీ, ఫలితంగా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ తప్పుడు సమాచార వ్యాప్తి పోలీసు శాఖ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు.
హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్‌ల పోలీసు ఉన్నతాధికారులతో సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసులు సమర్ధవంతంగా పని చేస్తున్నారనీ, నేరాలను తగ్గించడంతోపాటు అనేక వినూత్న పౌర కేంద్రీకృత పథకాలు, సంస్కరణలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని హోంమంత్రి చెప్పారు. నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిపెట్టిందని అన్నారు.
24 గంటలూ రౌడీషీటర్ల కార్యకలాపాలపై నిఘా ఉంచాలనీ, నిర్మానూష్య-ఏకాంత ప్రదేశాల్లో సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని డీజీపీని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఏరియాలోని ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, జిమ్‌లు, పాన్ షాపులు నోటిఫైడ్ టైమింగ్స్ ప్రకారం మూసివేయాలనీ, అలా జరగనిపక్షంలో తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్ పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు.
తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి మహమూద్ అలీ.. ముఖ్యంగా పాతబస్తీలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. "వ్యతిరేక అంశాలు, సమూహాల ద్వారా వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారం ఒక విసుగుగా మారింది" అని ఆయన చెప్పాడు. ఈ సమావేశంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, అదనపు డీజీ (సీఐడీ) మహేశ్ భగవత్, సీపీ రాచకొండ డీఎస్ చౌహాన్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు.