Medak: రానున్న తెలంగాన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ముందస్తు ప్రకటనతో ఉల్లాసంగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు, ఎన్నికల పోరులో విజయం సాధించాలనే పార్టీ ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తూ.. మంగళవారం వారి నియోజకవర్గాలకు తిరిగి వచ్చినప్పుడు వారి మద్దతుదారుల నుండి అద్భుతమైన స్వాగతం లభించింది.
Telangana Assembly Elections 2023: ఈ ఏడాది చివర్లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మూడో సారి అధికార పీఠం దక్కించుకోవాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలో నిలిచే 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ క్యాడర్ లో మరింత జోష్ ను పెంచుతూ.. దూకుడుగా ముందుకు సాగుతున్న కేసీఆర్.. మెదక్ సభ నుంచి ఎన్నికల ప్రచారం షూరు చేయబోతున్నారు. ఈ సభకోసం పార్టీ అగ్రనేతలు దగ్గరుండి మరి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
బుధవారం (ఆగస్టు 23న) మెదక్ లో సీఎం కేసీఆర్ 'ప్రగతి శంఖారావం'ను ప్రారంభించనున్నారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్నిప్రారంభించనున్నారు. ఇక్కడి నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో సీఎం బహిరంగ సభకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.
బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మరో రెండు కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాలుపంచుకుంటారని తెలిపారు. వీటితో పాటు వికలాంగులకు రూ.4016 చొప్పున పెంచిన పింఛన్లు, బీడీ కాంట్రాక్టర్లకు ఆసరా పింఛన్ల పంపిణీకి షెడ్యూల్ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Hon'ble Minister Harish Rao Garu's supervision for CM KCR Garu's Medak visit arrangements. Reviewed inauguration plans at Collectorate, SP office & BRS party office, ensuring a seamless event experience. pic.twitter.com/L3OVscFkfH
— Office of Harish Rao (@HarishRaoOffice)ప్రతిపక్ష పార్టీలేవీ తమ అభ్యర్థులను ఖరారు చేయకపోవడం, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్ చాలా కాలంగా రగులుతున్న అంతర్గత తిరుగుబాటును అణచివేసేందుకు సొంత నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇదే సమయంలో గ్రూపు తగాదాలతో తీవ్రంగా దెబ్బతిన్న బీజేపీ కూడా 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను వెతికేందుకు నానా తంటాలు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు కేసీఆర్ ముందస్తు ప్రకటనతో వచ్చిన భారీ అడ్వాంటేజ్ తో ఉత్సాహంగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు మంగళవారం తమ నియోజకవర్గాలకు తిరిగి రాగానే వారి మద్దతుదారుల నుంచి ఘనస్వాగతం లభించింది.
ప్రతిపక్షాలకు సవాల్ విసురుతూ ఒకేసారి 115 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించడం బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహం ప్రత్యేక లక్షణంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను ఖరారు చేయకముందే రెండు, మూడు సార్లు ప్రచార చక్రాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలన్న నిర్ణయానికి తోడు ప్రతి ఇంటికీ ఒకసారి కాదు, కనీసం రెండుసార్లు పర్యటించాలనే ప్రతిష్టాత్మక ప్రణాళిక ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ ఎన్నికల వ్యూహానికి అనుగుణంగా పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో వ్యూహాలు రచించడం ప్రారంభించారు. ఇప్పటికే మంత్రులు హరీశ్ రావు, జీ జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలకు చేరుకున్నారు. ఇప్పటికే తమ సన్నిహితులతో సమావేశమై ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలిసింది.