నా మనమడిపై దుష్ప్రచారం:జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై హోం మంత్రి మహమూద్ అలీ

By narsimha lode  |  First Published Jun 8, 2022, 3:34 PM IST


జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో తన మనమడు ఉన్నాడని దుష్ప్రచారం చేశారని తెలంగాణ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. వక్ఫ్ బోర్డు చైర్మెన్ ను ఆ పదవి నుండి తప్పించడం తన పరిధిలో లేదన్నారు. ఈ విషయం బోర్డు నిర్ణయం తీసుకుంటుందన్నారు.
 


హైదరాబాద్:Jubilee hills gang rape  ఘటనలో తన మనమడు ఉన్నాడని దుష్ఫ్రచారం చేశారని తెలంగాణ హోంమంత్రి Mahmood Ali చెప్పారు.  గ్యాంగ్ రేప్ ఘటన చాలా బాధాకరమన్నారు. ఈ తరహా ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.  తెలంగాణ పోలీసులు ఈ కేసును సమర్ధవంతంగా విచారణ చేస్తున్నారని ఆయన చెప్పారు. 

బుధవారం నాడు తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మీడియాతో మాట్లాడారు.  పిల్లలపై పేరేంట్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి కోరారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు. 

Latest Videos

undefined

also read:జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: జువైనల్ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన మైనర్లు

She Teams, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి  ఈ తరహా ఘటనలు అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి చెప్పారు.waqf board చైర్మెన్ ను తొలగించడం తన పరిధిలో లేదన్నారు. వక్ఫ్ బోర్డు ఈ విసయమై నిర్ణయం తీసుకుంటుందని  ఆయన తెలిపారు.

ఈ ఏడాది మే 28వ తేదీన అమ్నేషియా పబ్ లో గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత  బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. 

అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే  ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్  తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని Telangana రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు.

కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది.  తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది.ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.

ఈ కేసుకు సంబంధించి మీడియా సమావేశంలో మైనర్ బాలిక ఫోటోలు విడుదల చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ లలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ  కేసుపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది.  ఈ కేసులో ే ఏ1 నిందితుడిని కోర్టు కస్టడీకి ఇచ్చింది. జువైనల్ కోర్టులో మెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు మైనర్లు.

click me!