జీవోల మాయం, స్పందించని ప్రభుత్వం: హైకోర్టు ఆగ్రహం

By Siva KodatiFirst Published Mar 2, 2020, 4:14 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలంటూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోలను వెబ్‌సైట్లో పెట్టడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలంటూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోలను వెబ్‌సైట్లో పెట్టడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. 

సోమవారం దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం... పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని ఆదేశించినా ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయక పోవడం పై హైకోర్టు సీరియస్ అయ్యింది.

Also Read:తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు షాక్: 43 వేల జీవోలు మాయంపై నోటీసులు

అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని ప్రభుత్వం కోరింది. మూడు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు అదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

హైదరాబాద్ ఎల్బీ నగర్‌కు చెందిన పేరాల శేఖర్ రావు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 43,462 జీవోలు అదృశ్యం కావడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదృశ్యమైన జీవోలను తిరిగి ప్రభుత్వ జీవోల పోర్టల్‌లో ఉంచేలా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Also Read:నారాయణ, శ్రీచైతన్య కాలేజీల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు సీరియస్

దీనిపై గత బుధవారం విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం... ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకీ నోటీసులు జారీ చేస్తూ, నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. 

click me!