పాన్ షాప్ లో మహిళ దొంగతనం.. రూ.70వేలు విలువచేసే సిగరెట్లు చోరీ

Published : Mar 02, 2020, 01:58 PM IST
పాన్ షాప్ లో మహిళ దొంగతనం.. రూ.70వేలు విలువచేసే సిగరెట్లు  చోరీ

సారాంశం

 యథావిధిగా షాపు తెరిచేందుకు వచ్చిన శ్రీకాంత్..పాన్ షాప్ తలుపులు తెరచి ఉండడం చూసి షాకయ్యాడు. లోపల ఉండాల్సిన రూ. 70 వేల విలువైన సిగరెట్లు మాయమైనట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు


ఓ చిన్న పాన్ షాప్ లో దొంగతనం జరుగుతుందని ఎవరూ ఊహించరు కదా.అది కూడా సిగరెట్ల కోసం అందులోనూ ఓ మహిళ. కానీ అదే జరిగింది. అది కూడా హైదరాబాద్ నగరంలో. 

హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో మూసివున్న పాన్‌షాప్ నుంచి రూ.70 వేల విలువైన సిగరెట్లను ఓ మహిళా దొంగలించింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్మన్‌ఘాట్‌లోని మందమల్లమ్మ ఫంక్షన్ హాల్ సమీపంలో శ్రీకాంత్ పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి షాపు మూసి ఇంటికెళ్లాడు.

Also Read కోట్ల ఆస్తి ఉంది.. రూ.40లక్షల కోసం ఆత్మహత్య చేసుకుంటారా..?

ఆదివారం ఉదయం యథావిధిగా షాపు తెరిచేందుకు వచ్చిన శ్రీకాంత్..పాన్ షాప్ తలుపులు తెరచి ఉండడం చూసి షాకయ్యాడు. లోపల ఉండాల్సిన రూ. 70 వేల విలువైన సిగరెట్లు మాయమైనట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. 

షాపులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు సిగరెట్లు దొంగిలించింది ఓ మహిళ అని తెలిసి ఆశ్చర్యపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళను గుర్తింస్తామని పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu