హైదరాబాద్‌లో కరోనా.. ఎవరూ భయపడొద్దు: మంత్రి ఈటల

Siva Kodati |  
Published : Mar 02, 2020, 03:39 PM ISTUpdated : Mar 03, 2020, 11:21 AM IST
హైదరాబాద్‌లో కరోనా.. ఎవరూ భయపడొద్దు: మంత్రి ఈటల

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ జాడలు బయటపడిన నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు

తెలంగాణలో కరోనా వైరస్ జాడలు బయటపడిన నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు.

Also Read:హైదరాబాద్‌లో ఒకరికి కరోనా వైరస్: నిర్ధారించిన అధికారులు

తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్‌గా ఉందని రాజేందర్ తెలిపారు. సోమవారం ఇద్దరిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తిలో కోవిడ్-19 లక్షణాలు బయటపడ్డాయి.

Also Read:టెక్నాలజీ దిగ్గజాలపై కరోనా ‘పడగ’: ఉద్యోగుల ప్రయాణంపై ఆంక్షలు

మరో కేసులో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా జాడ కనిపించింది. ఇద్దరిని వైద్య పరీక్షల నిమిత్తం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పరిస్ధితిని సమీక్షిస్తోంది. కరోనా వార్తలు వచ్చిన వెంటనే తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ