అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో ప్రదీప్ మృతి: జీహెచ్ఎంసీపై హైకోర్టు సీరియస్

By narsimha lode  |  First Published Feb 23, 2023, 3:26 PM IST

హైద్రాబాద్ అంబర్ పేటలో  వీధి కుక్కల దాడిలో  ప్రదీప్  మృతి చెందడంపై  తెలంగాణ హైకోర్టు  ఆగ్రహం వ్యక్తం  చేసింది.  


హైదరాబాద్: నగరంలోని అంబర్ పేటలో  వీధికుక్కల దాడిలో  నాలుగేళ్ల ప్రదీప్  మృతి విషయంలో జీహెచ్ఎంసీ  నిర్లక్ష్యం   కన్పిస్తుందని  తెలంగాణ హైకోర్టు  అభిప్రాయపడింది.  జీహెచ్ఎంసీ తీరుపై హైకోర్టు  ఆగ్రహం వ్యక్తం  చేసింది.  

అంబర్ పేటలో  వీధికుక్కల దాడిలో  నాలుగేళ్ల బాలుడు ప్రదీప్  మృతి ఘటనను  తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకుంది.  ఈ విషయమై   గురువారం నాడు మధ్యాహ్నం  తెలంగాణ హైకోర్టు విచారణ  నిర్వహించింది.  వీధి కుక్కల విషయంలో  జీహెచ్ఎంసీ  ఏం చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది.  పూర్తి వివరాలతో  కౌంటర్ దాఖలు  చేయాలని  హైకోర్టు  ఆదేశించింది.   ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా  ఏం చర్యలు తీసుకున్నారని  హైకోర్టు ప్రశ్నించింది. బాలుడి కుటుంబానికి పరిహరం చెల్లించాలని  కూడా కోర్టు ఆదేశించింది.    తెలంగా రాష్ట్ర ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ  కమిషనర్ , హైద్రాబాద్ కలెక్టర్, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ , అంబర్ పేట  మున్సిపల్ అధికారులకు  తెలంగాణ హైకోర్టు  నోటీసులు  జారీచేసింది . ఈ ఏడాది మార్చి  16వ తేదీకి  విచారణను వాయిదా వేసింది  హైకోర్టు.  

Latest Videos

ఈ  నెల  19వ తేదీన  అంబర్ పేటలో  వీధి కుక్కల దాడిలో   నాలుగేళ్ల  చిన్నారి  ప్రదీప్  మృతి చెందాడు.  సెలవు దినం కావడంతో  కొడుకు, కూతురును తీసుకుని   గంగాధర్  తాను పనిచేసే కార్ల షోరూమ్ వద్దకు వెళ్లాడు.  కారు షోరూమ్  వద్ద   గంగాధర్  విధుల్లో  ఉన్నాడు . అదే సమయంలో  బయటకు వెళ్లిన   నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి  చేశాయి.ఈ దాడిలో  తీవ్రంగా గాయపడి న ప్రదీప్  ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  మృతి చెందాడు.  ఈ ఘటన తర్వాత  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వీధి కుక్కలు దాడుల ఘటనలు  వెలుగు చూస్తున్నాయి.

అంబర్ పేట ఘటనతో  రెండు రోజుల క్రితం  జీహెచ్ఎంసీ మేయర్  విజయలక్ష్మి  సమీక్ష నిర్వహించారు.  ఇవాళ  జీహెచ్ఎంసీ అధికారులతో  మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,  మహమూద్ అలీలు  సమీక్ష నిర్వహించారు.

also read:వీధి కుక్కలపై ఫిర్యాదుకు ఫోన్ నెంబర్, యాప్: జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రుల రివ్యూ

హైద్రాబాద్‌లో  వీధి కుక్కలు, కోతుల బెడదను అరికట్టేందుకు  చర్యలు తీసుకోవాలని   కూడా అధికారులను  మంత్రులు ఆదేశించారు. ఇదిలా ఉంటే  జీహెచ్ఎంసీ పరిధిలో  కుక్కకాటు  బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. 
 

click me!