హలియాలో కేసీఆర్ సభకు తొలగిన అడ్డంకులు: రైతుల హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ

By narsimha lodeFirst Published Apr 13, 2021, 1:47 PM IST
Highlights

కేసీఆర్ సభకు అనుమతి ఇవ్వొద్దని రైతులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను  తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది.

హైదరాబాద్: కేసీఆర్ సభకు అనుమతి ఇవ్వొద్దని రైతులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను  తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది.ఈ నెల 14వ తేదీన హలియాలో కేసీఆర్ సభ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ తలపెట్టింది. ఈ నెల 15వ తేదీతో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.

తమ భూముల్లో అనుమతి లేకుండా ఈ సభను నిర్వహిస్తున్నారని  కొందరు రైతులు ఈ నెల 12వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సభ నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అంతేకాదు కరోనా నేపథ్యంలో భారీ సంఖ్యలో జనం ఒకే చోట గుమికూడవద్దని ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రస్తావిస్తూ ఈ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వొద్దని కోరారు.అయితే ఈ పిటిషన్లను విచారించడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో రైతులు ఇవాళ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

also read:హలియాలో కేసీఆర్ సభ రద్దుకై హౌస్ మోషన్ పిటిషన్: అందరిచూపు హైకోర్టు వైపే

ఈ పిటిషన్ ను ఇవాళ తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఈ నెల 15వ తేదీతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  ప్రచారానికి తెరపడనుంది. ఎన్నికల ప్రచారానికి తెరపడడానికి ఒక్క రోజు ముందుగానే హలియాలో సీఎం కేసీఆర్ సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థిగా జానారెడ్డి బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా నోముల భగత్, బీజేపీ అభ్యర్ధిగా డాక్టర్ రవికుమార్ బరిలో దిగారు. 

click me!