తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 3వేల పైచిలుకు పాజిటివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Apr 13, 2021, 12:54 PM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 3వేల పైచిలుకు పాజిటివ్ కేసులు

సారాంశం

 గత 24గంటల్లో అంటే ఆదివారం రాత్రి 8గంటల నుండి సోమవారం రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,13,007మందికి కరోనా టెస్టులు చేయగా 3052మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో (ఆదివారం రాత్రి 8గంటల నుండి సోమవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 1,13,007మందికి కరోనా టెస్టులు చేయగా 3052మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,32,581కు చేరితే టెస్టుల సంఖ్య 1,11,81,010కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 778మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,06,678కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,131యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 16,118గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1772కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.3శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 89.5శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 92.21శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 50, నాగర్ కర్నూల్ 52, జోగులాంబ గద్వాల 14, కామారెడ్డి 111, ఆదిలాబాద్ 98, భూపాలపల్లి 14, జనగామ 32, జగిత్యాల 135, అసిఫాబాద్ 27, మహబూబ్ నగర్ 97, మహబూబాబాద్ 18, మెదక్ 23, నిర్మల్ 113, నిజామాబాద్ 279,  సిరిసిల్ల 61, వికారాబాద్ 61, వరంగల్ రూరల్ 24,  ములుగు 12, పెద్దపల్లి 49, సిద్దిపేట 79, సూర్యాపేట 63, భువనగిరి 53, మంచిర్యాల 78, నల్గొండ 109 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 406కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 301, రంగారెడ్డి 248, కొత్తగూడెం 44, కరీంనగర్ 87, ఖమ్మం 95, సంగారెడ్డి 123, వరంగల్ అర్బన్ 84కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:  

 

PREV
click me!

Recommended Stories

కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions
Telangana: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం