శాంతి చర్చలకు సిద్దంగా ఉన్నాం: మావోయిస్టులు

By narsimha lodeFirst Published Apr 13, 2021, 1:24 PM IST
Highlights

శాంతి చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్దంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
 

హైదరాబాద్: శాంతి చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్దంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.సాయుధ పోరాటాన్ని వీడాలంటూనే ప్రభుత్వం షరతులు పెడుతోందని మావోయిస్టు పార్టీ విమర్శించింది.చర్చలకు ప్రభుత్వమే సానుకూల వాతావరణం కల్పించాలని ఆ లేఖలో మావోయిస్టు పార్టీ కోరింది.

ఈ నెల 1 నుండి 25 వరకు ప్రజా ఉద్యమాల మాసంగా నిర్వహించినట్టుగా ఆ లేఖలో తెలిపింది మావోయిస్టు పార్టీ. ఈ నెల 26న భారత్ బంద్ నిర్వహిస్తున్నట్టుగా ఆ పార్టీ తెలిపింది. 2004లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా  ఉన్నారు. జానారెడ్డి హోంమంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో మావోయిస్టు పార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరిపింది.చర్చల పేరుతో అడవుల నుండి మావోయిస్టులు బయటకు వచ్చారు. ప్రకాశం జిల్లా నుండి నల్లమల అడవుల నుండి  మావోయిస్టులు బయటకు వచ్చారు. మావోయిస్టులతో చర్చల తర్వాత జరిగిన ఎన్ కౌంటర్లలో పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణించారు.
 

click me!