కేసీఆర్‌కు హైకోర్టు షాక్: ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మాణానికి హైకోర్టు నో

By narsimha lodeFirst Published Sep 16, 2019, 4:27 PM IST
Highlights

కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి హైకోర్టు షాకిచ్చింది. ఎర్రమంజిల్ లో కొత్త అసెంబ్లీ నిర్మాణాన్ని హైకోర్టు వ్యతిరేకించింది.


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హైకోర్టు షాకిచ్చింది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీలో నిర్మించాలనే ప్రతిపాదనను హైకోర్టు వ్యతిరేకించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎర్రమంజిల్ లో అసెంబ్లీని నిర్మించాలని  తలపెట్టింది. ఈ మేరకు ఈ ఏడాది జూలై మాసంలో  కూడ సీఎం కేసీఆర్ శంకుస్థాపన పనులను ప్రారంభించారు.

ఎర్రమంజిల్ లో అసెంబ్లీ భవన నిర్మాణ పనులను నిరసిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై  హైకోర్టు సుధీర్ఘంగా విచారణ జరిపింది. ప్రభుత్వంతో పాటు అసెంబ్లీ నిర్మించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల వాదనను కూడ హైకోర్టు వింది.రెండు వర్గాల వాదనలను విన్న తర్వాత తీర్పును గతంలోనే రిజర్వ్ చేసింది.

ఈ విషయమై సోమవారం నాడు హైకోర్టు తీర్పును వెలువరించింది. సోమవారం నాడు  తెలంగాణ హైకోర్టు ఎర్రమంజిల్ లో అసెంబ్లీ లో నిర్మించాలని తెలంగాణ మంత్రిమండలి తీర్మానాన్ని హైకోర్టు కొట్టివేసింది.
 

సంబంధిత వార్తలు

కొత్త భవనాలతో పెట్టుబడులు వస్తాయి: ఎర్రమంజిల్ కూల్చివేతపై హైకోర్టు

హైకోర్టు జోక్యం సరికాదు: అసెంబ్లీ కూల్చివేతపై కేసీఆర్ ప్రభుత్వ వాదన

ఎర్రమంజిల్ కూల్చివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

click me!