బాచుపల్లి యాక్సిడెంట్ లో చిన్నారి దుర్మరణం... సీఎస్ కు హైకోర్టు నోటీసులు

By Arun Kumar P  |  First Published Aug 9, 2023, 11:10 AM IST

హైదరాబాద్ శివారు బాాచుపల్లిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం చిన్నారి దీక్షితను బలితీసుకున్న ఘటనను హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. సీఎస్ తో పాటు సంబంధిత అధికారులను న్యాయస్థానం వివరణ కోరింది. 


హైదరాబాద్ : స్కూల్ కు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయిన చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. హైదరాబాద్ బాచుపల్లిలో జరిగిన ఈ ప్రమాదంపై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. గుంతలమయమైన రోడ్డులో తండ్రితో కలిసి వెళుతున్న చిన్నారి ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కిందపడిన మృతిచెందినట్లు వెలువడిన కథనాలు హైకోర్టు దృష్టికి వెళ్లాయి. వీటి ఆధారంగానే ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. 

చిన్నారి యాక్సిడెంట్ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్ తో పాటు ఆర్ ఆండ్ బి, హోం, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు అందాయి. అలాగే జిహెచ్ఎంసి, రాచకొండ పోలీస్ కమీషనర్, బాచుపల్లి ఎస్ ఎస్‌హెచ్‌వో అధికారులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  

Latest Videos

బాచుపల్లి ప్రమాదం ఎలా జరిగిందంటే... 

బాచుపల్లిలో నివాసముండే కిషోర్ తన కూతుర్ని బౌరంపేట డిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిస్తున్నాడు. రెండో తరగతి చదివే చిన్నారిని తండ్రే ప్రతిరోజూ స్కూల్ కు పంపించేవాడు. ఇలా ఇటీవల తండ్రితో కలిసి స్కూటీపై వెళుతుండగా దీక్షిత రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. బాచుపల్లి పరిధిలోని రెడ్డీస్ ల్యాబ్ సమీపంలో గుంతలమయమైన రోడ్డులో వెళుతుండగా తండ్రీకూతురు వెళతున్న స్కూటీ అదుపుతప్పింది. దీంతో చిన్నారి రోడ్డుపై పడిపోగా అదే సమయంలో వెనకనుండి వచ్చిన స్కూల్ బస్సు ఆమె పైనుంచి దూసుకెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కిషోర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 

Read More  జనగామ: తండ్రీ, కొడుకుతో కలిసి భర్తను చంపి... సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చిపెట్టిన మహిళ

రోడ్డు అద్వాన్న పరిస్థితి కారణంగానే బాలిక దీక్షిత మృతికి కారణమని స్థానికులు చెబుతున్నారు. దీంతో దీక్షిత మృతితో పాటు రోడ్డు దుస్థితి గురించి పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. వీటి ఆధారంగానే దీక్షిత మృతికి కారణమైన ప్రమాదం గురించి వివరాలను తెలపాలని అధికారులను కోరింది తెలంగాణ హైకోర్టు. 

 

click me!