సిబ్బంది పొరపాటు: మహబూబాబాద్‌ ఆసుపత్రిలో శిశువులు తారుమారు, చివరికి...

Published : Aug 09, 2023, 10:37 AM IST
సిబ్బంది పొరపాటు:  మహబూబాబాద్‌ ఆసుపత్రిలో శిశువులు తారుమారు, చివరికి...

సారాంశం

మహబూబాబాద్ ఆసుపత్రిలో సిబ్బంది పొరపాటు కారణంగా  శిశువులు తారుమారయ్యారు.  అయితే  చివరికి  కథ సుఖాంతమైంది.  

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని  ఆసుపత్రిలో  శిశువుల తారుమారు ఘటన కలకలం రేపుతుంది. అయితే  ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి  ఆసుపత్రి సిబ్బంది  ఎవరి శిశువులను వారికే  అప్పగించడంతో  పేరేంట్స్  శాంతించారు.మహబూబాబాద్ జిల్లా గొల్లపల్లి గ్రామానికి  చెందిన  సుమిత్ర ఈ ఏడాది జూలై  31న  మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో  డెలీవరి అయింది.  సుమిత్రకు  కొడుకు పుట్టాడు. పుట్టిన చిన్నారికి పచ్చకామెర్లు  రావడంతో  చిన్నారిని ఇంక్యుబేటర్ లో  ఉంచారు.

 అయితే  అదే ఆసుపత్రిలో మరో మహిళ డెలీవరి అయింది.  ఈ మహిళ  పాపకు జన్మనిచ్చింది. ఈ చిన్నారికి  శ్వాస సంబంధమైన  సమస్య తలెత్తడంతో  సుమిత్ర  కొడుకు స్థానంలో  ఈ చిన్నారిని ఉంచారు.  అయితే తన కొడుకు  పాలు పట్టేందుకు సుమిత్ర  ఇంక్యుబేటర్ ఉన్న ప్రాంతానికి వెళ్లింది. కొడుకు స్థానంలో కూతురు ఉండడంతో షాక్ కు గురైంది.  ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. సుమిత్ర భర్త, సుమిత్ర తల్లి ఇతర కుటుంబ సభ్యులు  ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు.  కొడుకు పుడితే  బిడ్డగా ఎలా మారిందని ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు.

ఆసుపత్రి  సిబ్బంది ఈ విషయమై  విచారణ జరిపారు.  పొరపాటున  సుమిత్ర కొడుకు స్థానంలో  మరో మహిళ కూతురుకు చికిత్స అందిస్తున్న విషయం తేలింది.  పొరపాటును ఆసుపత్రి సిబ్బంది అంగీకరించారు.  ఈ విషయమై  సుమిత్ర  కుటుంబ సభ్యులు  పోలీసులకు ఫిర్యాదు  చేశారు.ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు  విచారణ జరిపారు.  భవిష్యత్తులో  ఈ తరహా  ఘటనలు జరగకుండా చూసుకుంటామని ఆసుపత్రి సిబ్బంది హామీ ఇచ్చారు. సుమిత్రకు  కొడుకును అప్పగించారు.  మరో మహిళకు పుట్టిన కూతురును ఆమెకు అప్పగించారు

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu