హైదరాబాద్‌లో ఫ్యాన్సీ నెంబర్‌ క్రేజ్‌.. ఆ నెంబర్‌కు రూ. 21.6 లక్షలు.. దక్కించుకుంది ఎవరంటే..

Published : Aug 09, 2023, 10:13 AM IST
హైదరాబాద్‌లో ఫ్యాన్సీ నెంబర్‌ క్రేజ్‌.. ఆ నెంబర్‌కు రూ. 21.6 లక్షలు.. దక్కించుకుంది ఎవరంటే..

సారాంశం

ఫ్యాన్సీ నెంబర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెంటిమెంట్, ఇష్టమైన నెంబర్, న్యూమరాలజీ.. తదితర  కారణాలతో ఫ్యాన్సీ నెంబర్ల కోసం  బడా  బాబులు భారీగాను వెచ్చిస్తుంటారు.

ఫ్యాన్సీ నెంబర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెంటిమెంట్, ఇష్టమైన నెంబర్, న్యూమరాలజీ.. తదితర  కారణాలతో ఫ్యాన్సీ నెంబర్ల కోసం  బడా  బాబులు భారీగాను వెచ్చిస్తుంటారు. తాజాగా జరిగిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం రవాణా శాఖకు కాసుల పంట కురిపించింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం ఒక్కరోజే రూ.53,34,894 ఆదాయం వచ్చింది. ఈ వేలంలో అత్యధికంగా ‘‘9999’’ నెంబర్ ఏకంగా రూ. 21,60,000 పలికింది.  రిజిస్ట్రేషన్ నంబర్‌ల కొత్త సిరీస్ GDకి సంబంధించి ఫ్యానీ నెంబర్ల కోసం వేలం నిర్వహించారు. 

అత్యధిక బిడ్డర్‌లో ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్.. TS 09 GD 9999 నంబర్‌కు రూ.21.6 లక్షలు వెచ్చించింది. ఇక, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ TS 09 GD 0009 నంబర్‌ను రూ.10.5 లక్షలకు దక్కించుకుంది. ఆంధ్రా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్.. TS 09 GD 0001 నంబర్ కోసం రూ. 3,01,000 వెచ్చించింది.

ఇతర ఫ్యాన్సీ నంబర్లలో టీఎస్ 09 జీడీ 0006ను గోయాజ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్‌ రూ.1.83 లక్షలుకు సొంతం చేసుకుంది. టీఎస్ 09 జీడీ 0019 నెంబర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రూ. 1,70,100కు దక్కించుకుంది. టీఎస్ 09 జీడీ 0045 ను రూ.1,55,000కు సాయి పృధ్వీ ఎంటర్ ప్రైజెస్, టీఎస్ 09 జీడీ 0007 ను రూ.1,30,000కు ఫైన్ ఎక్స్‌పర్ట్స్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్, టీఎస్ 09 జీడీ 0027 ను రూ.1,04,999కు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కొనుగోలు చేసింది.

ఇందుకు సంబంధించి హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ చరిత్రలో ఇదే అత్యధిక ధర పలికిన బిడ్డింగ్. ఈ బిడ్డింగ్ సాధారణంగా కొత్త సిరీస్ ప్రారంభంలో జరుగుతుంది. ఎందుకంటే ఒక్కో సిరీస్‌లో 9,999 నంబర్లు ఉంటాయి’’ అని  చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu
Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?