విరమించాలని చెప్పలేం, పరిమితులుంటాయి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు

By narsimha lodeFirst Published Nov 11, 2019, 5:58 PM IST
Highlights

ఆర్టీసీ కార్మికులను సమ్మె విరమించాలని తాము చెప్పలేమని, తమకు కొన్ని పరిమితులు ఉంటాయని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది.ఆర్టీసీ సమ్మెపై విచారణను రేపటికి వాయిదా వేసింది.

అమరావతి: కార్మికులను సమ్మె విరమించాలని తాము చెప్పలేమని, తమకు కొన్ని పరిమితులు ఉంటాయని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది.ఆర్టీసీ సమ్మెపై విచారణను రేపటికి వాయిదా వేసింది.

Also read:మా పరిధిలో ఉందా, లేదా చూస్తాం: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు

సమ్మెతో పాటు ఆర్టీసీ ప్రైవేటీకరణపై దాఖలైన రెండు పిటిషన్లను సోమవారం మధ్యాహ్నం హైకోర్టు విచారించింది. ఈ విచారణ సమయంలో ఆర్టీసీ సమ్మె విషయమై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

కార్మికుల సమ్మె చట్ట విరుద్దమైందని, సమ్మెను విరమింజేయాలని ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వాదించారు. అయితే ఈ వాదనను ఆర్టీసీ తరపు న్యాయవాది తోసిపుచ్చారు.

Also read:ఆర్టీసీ నష్టాలు రూ.5269 కోట్లు: అఫిడవిట్‌లో వివరాలివీ...

తమకు కూడ కొన్ని పరిమితులు ఉంటాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలా చేయాలని ఎవరిని కూడ తాము ఆదేశించలేమని కోర్టు తేల్చి చెప్పింది. పరిమితికి మించి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.

కి ఈ ఏడాది ఆగస్టు నాటికి సుమారు రూ. 5వేలకు పైగా బకాయిలు అప్పులు ఉన్నాయని, రూ. 47 కోట్లను చెల్లిస్తే ఆర్టీసీని నష్టాల ఊబిలో నుండి బయటపడేయలేమని  ప్రభుత్వం అభిప్రాయపడింది.ఇదే విషయాన్ని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం ప్రకటించింది.

Also Read:యూనియన్లతో ఇక చర్చల్లేవ్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టుకు చెప్పనున్న కేసీఆర్ సర్కార్

సమ్మె విషయమై మెట్టు దిగాలని  ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యానికి తాము చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. కార్మికులతో చర్చలు జరపాలని తాము కోరినట్టుగా  హైకోర్టు గుర్తు చేసింది.

Also read:ఈ నెల 12న నిరవధిక దీక్షకు దిగుతున్నాం: ఆశ్వత్థామరెడ్డి

అయితే సమ్మెపై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.మంగళవారంనాడు హైకోర్టు సమ్మె విషయమై ఏ రకమైన తీర్పును చెబుతోందోననేది ప్రస్తుతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు అక్టోబర్ 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంలు తమ మద్దతును ప్రకటించాయి. ఆర్టీసీ జేఎసీ ఈ నెల 18వ తేదీ వరకు తమ నిరసన కార్యక్రమాలను ప్రకటించింది.

ఈ నెల 18వ తేదీన జేఎసీ నేతు సడక్ బంద్ నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీన జేఎసీకి చెందిన నలుగురు కీలక నేతలు నిరవధిక దీక్షకు దిగనున్నారు. ఆర్టీసీ కార్మికులు 

click me!