నిరుద్యోగులకు శుభవార్త.. 2391 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

By Siva KodatiFirst Published Jan 27, 2023, 4:34 PM IST
Highlights

2,391 కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. వీటిలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185 పోస్టులు వున్నాయి.

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2,391 కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. వీటిలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185 పోస్టులు వున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా.. తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ,గ్రూప్ 4, పోలీస్, మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గతేడాది 544 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 23 ఇంగ్లీష్, 27 తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా వున్నాయి. 

Also Read: తెలంగాణలో కొనసాగుతోన్న కొలువుల జాతర.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

దీనికి ముందురోజే ఖాళీగా వున్న 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే . అర్హులైన అభ్యర్ధులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామకాలు జరుపుతామని వెల్లడించింది. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు.. వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆ కాసేపటికే 1365 గ్రూప్ 3 పోస్టులకు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తెలిపింది.

click me!