బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనయుడు భగీరథకు దుండిగల్ పోలీసులు ఇవాళ నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు బండి భగీరథకు దుండిగల్ పోలీసులు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేశారు. సహచర విద్యార్ధిపై భగీరథ దాడి చేశారని అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. తన సహచర విద్యార్ధిపై బండి భగీరథ దాడి చేసినట్టుగా సోషల్ మీడియాలో వీడియోలు ఇటీవల కాలంలో వెలుగు చూశాయి. ఈ నెల 16వ తేదీన భగీరథపై దుండిగల్ పోలీసులు కేసు నమోదుచేశారు. మహీంద్రా యూనివర్శిటీ అధికారులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి బండి భగీరథ్ దుండిగల్ పోలీసుల ఎదుట ఈ నెల 16న హజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి తాను విచారణకు సహకరిస్తానని భగీరథ పోలీసులకు చెప్పారు. న్యాయవాది కరుణసాగర్ తో కలిసి బండి భగీరథ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. మహీంద్రా యూనివర్శిటీ అధికారుల ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు బండి భగీరథపై ఐపీసీ సెక్షన్లు 323, 341, 504, 506 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి భగీరథకు దుండిగల్ పోలీసులు ఇవాళ నోటీసులు జారీ చేశారు.
also read:బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు స్టేషన్ బెయిల్.. వెలుగులోకి మరో వీడియో..!
తన కుమారుడు సహచర విద్యార్ధిపై దాడి చేశారని దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంపై బండి సంజయ్ ఈ నెల 17వ తేదీన స్పందించారు. తనతో రాజకీయం చేయాలని ఆయన సవాల్ విసిరారు. తన కొడుకుపై కేసు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు.