కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు భేటీ అయ్యారు. హత్ సే హత్ సే జోడో యాత్రకు మద్దతివ్వాలని కోరారు.
కొడంగల్: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు భేటీ అయ్యారు . హత్ సే హత్ సే జోడో యాత్ర కు మద్దతివ్వాలని గురునాథ్ రెడ్డిని రేవంత్ రెడ్డి కోరారు. కొడంగల్ నుండి ఆరు దఫాలు గురునాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా గురునాథ్ రెడ్డి పోటీ చేశారు. గురునాథ్ రెడ్డిపై టీడీపీ అభ్యర్ధిగా రేవంత్ రెడ్డ పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూడ ఇదే అసెంబ్లీ స్థానం నుండి రేవంత్ రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఈ స్థానం నుండి ఓటమి పాలయ్యాడు.
కొంతకాలం క్రితం గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పట్నం నరేందర్ రెడ్డి గెలుపులో గుర్నాథ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మెన్ పదవిని ఇస్తామని గుర్నాథ్ రెడ్డికి ఇచ్చిన హమీని బీఆర్ఎస్ నాయకత్వం నిలుపుకోలేదు. దీంతో గుర్నాథ్ రెడ్డి బీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గుర్నాథ్ రెడ్డితో భేటీ అయ్యారు. కొడంగల్ మున్సిపల్ చైర్మెన్ గా గుర్నాథ్ రెడ్డి కొడుకు జగదీశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు. గున్నాథన్ రెడ్డి కొడుకు ముద్దప్ప ఎంపీపీగా కొనసాగుతున్నారు.