తెలంగాణా అసెంబ్లీకి కొత్త కార్యదర్శి

First Published Aug 30, 2017, 10:42 PM IST
Highlights
  • తెలంగాణా అసెంబ్లీ నూతన కార్యదర్శిగా నరసింహాచార్యులును ప్రభుత్వం నియమించింది.
  • వెలుపలి వ్యక్తులను కార్యదర్శిగా తెచ్చేకంటే అసెంబ్లీలో పనిచేస్తున్న వారికే ప్రమోషన్లు ఇవ్వాలని కెసిఆర్ అనుకోవటంతోనే నరసింహాచార్యులుకు ప్రమోషన్ వచ్చింది.
  • రిటైర్ అయిన వారినే ఎక్స్ టెన్షన్లపై కొనసాగించే బదులు పదోన్నతులు ఇవ్వలని నిర్ణయించుకున్న తర్వాతే సదారాంను బలవంతంగా సాగనంపారు.
  • ముంబాయ్ నుండా హరీష్ గురువారం హైదరాబాద్ రాగానే సంతకమై ఫైల్ గవర్నర్ దగ్గరకు వెళుతుంది.

తెలంగాణా అసెంబ్లీ నూతన కార్యదర్శిగా నరసింహాచార్యులును ప్రభుత్వం నియమించింది.  నాటకీయ పద్దతిలో  సెక్రెటరీ నియామకం జరిగింది. వెలుపలి వ్యక్తులను కార్యదర్శిగా తెచ్చేకంటే అసెంబ్లీలో పనిచేస్తున్న వారికే ప్రమోషన్లు ఇవ్వాలని కెసిఆర్ అనుకోవటంతోనే నరసింహాచార్యులుకు ప్రమోషన్ వచ్చింది. సరే, పై స్ధాయిలో పదోన్నతులొస్తే క్రిందున్న అందరికీ వస్తాయి కదా?

ఇప్పటి వరకూ ఇన్ఛార్జ్ కార్యదర్శిగా ఉన్న రాజసదారాంను కెసిఆర్ ఒకరకంగా బలవంతంగా పంపినట్లే. సమైక్య రాష్ట్రంలోనే కార్యదర్శిగా రిటైర్ అయినా, సదారాం నాలుగు సంవత్సరాల నుండి ఎక్స్ టెన్షన్ల మీదే కొనసాగుతున్నారు. చివరకు రిటైర్ అయిన వారినే ఎక్స్ టెన్షన్లపై కొనసాగించే బదులు పదోన్నతులు ఇవ్వలని నిర్ణయించుకున్న తర్వాతే సదారాంను బలవంతంగా సాగనంపారు. సదారాంను పంపేయాలని, నరసింహాచార్యులకే పదోన్నతి ఇవ్వాలని సిఎం బుధవారం మధ్యాహ్నం నిర్ణయించారు.

సరే, ఒకసారి నిర్ణయం తీసుకోగానే, అదే విషయాన్ని సదారాంకు చెప్పి ఆ మేరకు ఆర్డర్లు రెడీ చేయించారు సిఎం. అలాగే, నియోజకవర్గం పర్యటనకు వెళుతున్న స్పీకర్ ముధుసూధనాచారిని వెనక్కు పిలిపించి మరీ ఆర్డర్ పై సంతకాలు చేయించారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు సంతకం తప్ప మిగితా అందరి సంతకాలూ అయిపోయాయి నోట్ ఫైల్ పై. ముంబాయ్ నుండా హరీష్ గురువారం హైదరాబాద్ రాగానే సంతకమై ఫైల్ గవర్నర్ దగ్గరకు వెళుతుంది.  బహుశా గురువారం సాయంత్రంలోగా ఆర్డర్ రావచ్చని అనుకుంటున్నారు.

విభజన చట్టం ద్వారానే రెండు రాష్ట్రాలు విడిపోయినా తెలంగాణా సిఎం కెసిఆర్ ఒకలాగ ఆలోచిస్తే, చంద్రబాబునాయుడు మాత్రం ఇంకోలా ఆలోచిస్తున్నారు. అర్హులను వదిలిపెట్టి బయట వ్యక్తులనే ప్రోత్సహిస్తున్నారు. వారికి నిబందనలు ఏమీ తెలీకపోయినా పర్వాలేదు వెలుపలి వ్యక్తులే ముద్దొస్తున్నారు చంద్రబాబుకు.

click me!