జిమ్నాస్ట్ మేఘన రెడ్డికి సర్కారు సాయం

First Published Aug 30, 2017, 5:41 PM IST
Highlights
  • జిమ్నాస్ట్ మేఘన రెడ్డికి సర్కారు సాయం
  • హామీ ఇచ్చిన కేటిఆర్
  • బంగారు పతకం సాధించడం పట్ల కేటిఆర్ అభినందనలు

జిమ్నాస్టిక్స్ జాతీయ ఛాంపియన్ అయిన మేఘన రెడ్డి ఈరోజు మంత్రి కేటీ రామారావును కలిశారు. జాతీయ క్రీడ ల్లో మేఘనా రెడ్డి రిథమి క్ జిమ్నాస్టిక్స్లో బంగారు  పతకం సాధించారు. తన తదుపరి లక్ష్యం కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశం తరఫున బంగారు పతకం సాధించడమే నని ఆమె ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

ఇందుకోసం తాను దేశవిదేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలకు హజరవుతున్నారని తెలిపారు. తాను పాల్గొంటున్న జిమ్నాస్టిక్స్ లో శిక్షణ చాలా ఖరీదుతో కూడుకున్నవి అంశమని ఈ మేరకు ప్రభుత్వం తరఫున కొంత ఆర్థిక సాయం అందిస్తే కచ్చితంగా తన భవిష్యత్తుకు లాభం చేకూరుతుందని మంత్రికి తెలిపారు.

మేఘన రెడ్డి తదుపరి శిక్షణ కోసం ప్రభుత్వం తరఫున సాధ్యమైనంత మేరకు ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి కెటి రామారావు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మేఘనా రెడ్డి కి ఒక జ్ఞాపికను అందజేశారు. మేఘన రెడ్డి తర్ఫీదు కోసం ఆమె తల్లిదండ్రులు చేస్తున్న కృషిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

click me!