రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ విషయంలో కీలక నిర్ణయం..

By Sairam Indur  |  First Published Mar 2, 2024, 1:48 PM IST

తెలంగాణ ప్రభుత్వం త్వరలో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కమిషన్ రైతుల, కౌలు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుందని తెలిపారు.


తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతులు, కౌలు రైతుల సంక్షేమం కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్ రైతుల సమస్యలు, పరిష్కారాలు, హక్కులు కోసం పని చేయనుంది. పలు విషయాల్లో ప్రభుత్వానికి సిఫార్సులు, సూచలను అందిస్తుంది.

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం.. ఎందుకంటే ?

Latest Videos

తెలంగాణ సచివాలయంలో వివిధ సామాజిక సంఘాలు, పౌర సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యావ్యవస్థ బలోపేతానికి విద్యాసంఘం విధానాలను రూపొందిస్తుందని, అలాగే రైతులు, కౌలు రైతుల సంక్షేమం కోసం రైతు కమిషన్ సిఫార్సులు చేయడంతో పాటు వారి సమస్యలను కూడా పరిష్కరిస్తుందని చెప్పారు.

కౌలు రైతుల సంక్షేమం, హక్కుల పరిరక్షణపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుందని చెప్పారు. రైతు భరోసా ప్రయోజనాల విస్తరణపై విస్తృతంగా చర్చ జరగాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిస్సహాయులకు లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అవసరమైతే నిజమైన లబ్ధిదారులకు మరింత సాయం అందించాలన్నారు. పంటల బీమా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ప్రకటించారు.

యాదాద్రి.. ఇక యాదగిరిగుట్ట..

రాష్ట్రంలో పంట మార్పిడి పథకాలను అవలంబించాలని, రైతులు అన్ని పంటలను పండించడానికి కొత్త పద్ధతులను అవలంబించాలని సూచించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్ని గంటల్లోనే ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్ ను ప్రారంభించి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రజాభవన్ తలుపులు తెరిచామని అన్నారు.

కాంగ్రెస్ కు నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు.. ఎందుకంటే ?

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టనుందని అన్నారు. 

click me!