175 ఎకరాల రక్షణ శాఖ భూమి తెలంగాణకు కేటాయింపు: ఎలివేటేడ్ కారిడార్లకు గ్రీన్ సిగ్నల్

Published : Mar 02, 2024, 11:54 AM ISTUpdated : Mar 02, 2024, 12:42 PM IST
175 ఎకరాల రక్షణ శాఖ భూమి తెలంగాణకు కేటాయింపు: ఎలివేటేడ్ కారిడార్లకు గ్రీన్ సిగ్నల్

సారాంశం

రక్షణ శాఖకు చెందిన  175 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు  కేంద్రం  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


హైదరాబాద్: 175 ఎకరాల రక్షణ శాఖ భూమిని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది కేంద్ర రక్షణ శాఖ. దీంతో  రోడ్లు, ఎలివేటేగ్ కారిడార్ల నిర్మాణానికి  ఇబ్బందులు తొలిగిపోతాయి.  ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుండి  కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా  కేంద్రం అనుమతులను ఇచ్చింది. 

also read:ఏపీలో బీజేపీ కోర్‌కమిటీ భేటీ: అభ్యర్థుల ఎంపిక, కీలకాంశాలపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత  ఈ ఏడాది జనవరి  5న  కేంద్ర క్షణ శాఖ మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టుగా  తెలంగాణ సీఎంఓ తెలిపింది.  ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు  రక్షణ శాఖ పరిధిలోని భూములను  రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరడంతో  కేంద్ర రక్షణ శాఖ సానుకూలంగా స్పందించిందని  సీఎంఓ వివరించింది. తమ వినతిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీకి, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు  ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

also read:12 స్థానాల్లో ఒక్క పేరు: లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్

 డిఫెన్స్ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి  బదిలీ చేయాలని  కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై  కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి  హర్షం వ్యక్తం చేశారు.  ఇందుకు గాను  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి  రాజ్ నాథ్ సింగ్ కు  కిషన్ రెడ్డి  ధన్యవాదాలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా  44వ నెంబర్  జాతీయ రహదాదిరి (కామారెడ్డి మార్గంలో) ఒకటో నెంబర్ రాష్ట్ర రహదారి( (సిద్దిపేట మార్గంలో)  ఎలివేటేడ్  కారిడార్లు, టన్నెళ్ల  నిర్మాణానికి  వెసులుబాటు కలుగుతుంది. మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రజా జీవనాన్ని సులభతరం చేసేందుకు గత పదేళ్లుగా  దేశ ప్రజలకు అందిస్తున్న గ్యారంటీకి ఉదహరణ అని  కిషన్ రెడ్డి  చెప్పారు.

 

also read:రెండో జాబితాపై టీడీపీ-జనసేన కసరత్తు: సీనియర్లకు చోటు?

 

హైద్రాబాద్ నుండి కరీంనగర్, రామగుండాన్ని కలిపే రాజీవ్ రహదారిపై  11.3 కి.మీ పొడవునా నిర్మించే ఎలివేటేడ్  కారిడార్ కు  భూసేకరణ అవసరమైంది.  ఇందులో కొంత భూమి రక్షణశాఖ పరిధిలో ఉంది.  దీంతో రాష్ట్ర ప్రభుత్వం  ఈ విషయమై కేంద్ర రక్షణశాఖతో సంప్రదింపులు జరిపింది. కేంద్రం నుండి సానుకూలంగా స్పందించింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!