12 స్థానాల్లో ఒక్క పేరు: లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్

Published : Mar 02, 2024, 09:50 AM IST
12 స్థానాల్లో ఒక్క పేరు: లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్

సారాంశం

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల  జాబితాపై తెలంగాణ  కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్ పెట్టింది.

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలపై  కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది.తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని  కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నివాసంలో  శుక్రవారం నాడు  కాంగ్రెస్ పార్టీ  కీలక నేతలు భేటీ అయ్యారు.  పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దింపే అభ్యర్థుల ఎంపికపై  చర్చించారు. దాదాపు రెండు గంటలకు పైగా  ఈ సమావేశం జరిగింది.

also read:అలా అయితే రాజకీయాల నుండి తప్పుకుంటా, బీఆర్ఎస్‌ను మూసేస్తారా: కేటీఆర్ కు కోమటిరెడ్డి సవాల్

గత ఏడాది నవంబర్ మాసంలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో  పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి మెజారిటీ ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ వ్యూహారచన చేస్తుంది.

రాష్ట్రంలోని  17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు  309 మంది ధరఖాస్తులు చేసుకున్నారు.ఈ ధరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి  కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ  ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపింది.

also read:బీఆర్ఎస్‌కు షాక్: బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్

రాష్ట్రంలోని  12 పార్లమెంట్ స్థానాలకు ఒక్క అభ్యర్ధి పేరును కాంగ్రెస్ నాయకత్వం  కేంద్ర ఎన్నికల కమిటీకి పంపింది.  మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో  ఒక్క పేరు కోసం  ఏకాభిప్రాయం కుదరలేదు.

రాష్ట్రంలోని  పలు నియోజకవర్గాలకు కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్థులు

నల్గొండ - జానారెడ్డి/రఘువీర్ రెడ్డి
జహీరాబాద్- సురేష్ షెట్కార్
మహబూబ్ నగర్- వంశీచంద్ రెడ్డి
చేవేళ్ల- పట్నం సునీత మహేందర్ రెడ్డి
 నిజామాబాద్- జీవన్ రెడ్డి
కరీంనగర్- ప్రవీణ్ కుమార్ రెడ్డి
పెద్దపల్లి- గడ్డం వంశీ
సికింద్రాబాద్- బొంతు రామ్మోహన్
భువనగిరి- చామల కిరణ్ కుమార్ రెడ్డి
 మహబూబాబాద్-  బలరాం నాయక్

also read:జనసేనను చంద్రబాబు నిర్వీర్యం చేస్తారు: పవన్ కు హరిరామ జోగయ్య మరో లేఖ

ఖమ్మం, ఆదిలాబాద్ , మెదక్ స్థానాలపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని  తెలుస్తుంది.  తెలంగాణ రాష్ట్రం నుండి రాహుల్ గాంధీని  పోటీ చేయాలని  కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.   రాహుల్ గాంధీని  ఖమ్మం లేదా భువనగిరి, నల్గొండ పార్లమెంట్ స్థానాల నుండి పోటీ చేయించాలని  ఆ పార్టీ నాయకత్వం  ప్రతిపాదిస్తుంది.  అయితే  ఈ విషయమై రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

also read:రెండో జాబితాపై టీడీపీ-జనసేన కసరత్తు: సీనియర్లకు చోటు?

రాష్ట్రం నుండి సోనియా గాంధీని పోటీ చేయాలని గతంలో  కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీర్మానం చేసింది. అయితే ఆరోగ్య కారణాలతో సోనియా గాంధీ  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. గత మాసంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో  రాజస్థాన్ నుండి సోనియా గాంధీ విజయం సాధించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్