హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనం: హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్న కేసీఆర్ సర్కార్

By narsimha lodeFirst Published Sep 12, 2021, 12:51 PM IST
Highlights


ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు  ఇచ్చిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆయన హైకోర్టును కోరారు.

హైదరాబాద్:ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.వినాయక విగ్రహలు, దుర్గామాత విగ్రహల నిమజ్జనం  చేయకూడదని న్యాయవాది వేణుమాధవ్ పిల్ దాఖలు చేశారు.

also read:వినాయక విగ్రహల నిమజ్జనం: హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

ఈ విషయమై విచారణ నిర్వహించిన హైకోర్టు హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై ఆంక్షలు విధించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయవద్దని ఆదేశించంది. చిన్న విగ్రహలు, పర్యావరణానికి ఇబ్బంది కల్గించని విగ్రహలను రబ్బర్ బండ్ ఏర్పాటు చేసి విగ్రహలను నిమజ్జనం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

దీంతో హైద్రాబాద్ పోలీసులు గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీకి నోటీసులు జారీ చేశారు. హుస్సేన్ సాగర్ లో  వినాయక విగ్రహలను నిమజ్జనం చేయవద్దని ఆ నోటీసులో పేర్కొన్నారు.అయితే ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనాన్ని కొనసాగించేందుకు అనుమతివ్వాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శఆఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైకోర్టును కోరారు. 48 గంటల్లోనే హుస్సేన్ సాగర్ ను శుభ్రం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

click me!