సినీ నటుడు సాయిధరమ్ తేజ్‌కి ప్రమాదం: తొలుత గుర్తించింది ఇతనే....

By narsimha lodeFirst Published Sep 12, 2021, 12:15 PM IST
Highlights


సినీ నటుడు సాయిధరమ్ తేజ్ ను  అంబులెన్స్ లో పనిచేసే  ఆరోగ్య కార్యకర్త  మారుతి గుర్తించాడు. ఈ నెల 10వ తేదీన దుర్గం చెరువుపై ఉన్న కేబుల్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ గాయపడి ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్: సినీ నటుడు సాయిధరమ్ తేజ్ ను అంబులెన్స్‌లో పనిచేసే ఆరోగ్య కార్యకర్త మారుతి తొలుత గుర్తించాడు. ఈ విషయాన్ని ఆయన తనపై పనిచేసే మెడికల్ టీమ్ కు సమాచారం పంపారు.ఈ నెల 10వ తేదీ రాత్రి దుర్గం చెరువుపై ఉన్న తీగెల వంతెన పై నుండి నుండి కిందపడిపోయి అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

also read:సాయిధరమ్ తేజ్ బైక్ సెకండ్ హ్యాండ్.. పోలీసుల విచారణలో తేలింది ఇదే!

ఈ నెల 10వ తేదీ రాత్రి దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జిపై ఆటోను తప్పించబోయిన సాయిధరమ్ తేజ్ బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు.దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని అక్కడే ఉన్న కొందరు స్థానికులు గుర్తించి 108కి ఫోన్ చేశారు. దీంతో మాదాపూర్ సమీపంలోని ఓ రోగిని ఆసుపత్రిలో చేర్పించి తిరిగి వెళ్తున్న 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందింది. 

ఈ ప్రమాదం జరిగిన స్థలానికి సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అంబులెన్స్ ఆగి ఉంది. ఎవరో వ్యక్తి దుర్గుం చెరువు కేబుల్ పై నుండి పడి గాయపడినట్టుగా సమాచారం రావడంతో 10 నిమిషాల్లో సంఘటనస్థలానికి చేరుకొన్నారు.  సాయిధరమ్ తేజ్ ను అంబులెన్స్ లో తీసుకొని మెడికొవర్ ఆసుపత్రి వైపుగా అంబులెన్స్ ను నడిపించాడు డ్రైవర్  శివ. 

అంబులెన్స్ లో ఉండే ఆరోగ్య కార్యకర్త మారుతి సాయిథరమ్ తేజ్ కు ప్రాథమిక చికిత్స చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో సాయిథరమ్ తేజ్ ముఖంపై గాయాలకు చికిత్స చేస్తున్న క్రమంలో సాయిధరమ్ తేజ్ గా మారుతి గుర్తించాడు. వెంటనే తమ మెడికల్ టీమ్ చీఫ్ కు సమాచారం ఇచ్చాడు.

అతని సూచన మేరకు మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మెడికొవర్ ఆసుపత్రిలో అతడిని చేర్పించారు. తొలుత సాయిధరమ్ తేజ్ గా ఎవరూ గుర్తించలేదని  మారుతి, శివలు చెప్పారు. సాధారణ వ్యక్తులేనని భావించామన్నారు. మారుతే తొలుత గుర్తించారు.  సకాలంలో ఆయను మెడికొవర్ ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత అపోలో ఆసుపత్రికి తరలించారు.


 

click me!