
మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన బోనులో పడింది. శనివారం రాత్రి కామారం తాండా సమీపంలో ఏర్పాటుచేసిన బోనులో చిరుతను గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని బోనులో చిక్కిన చిరుతను తరలించారు. గతకొంత కాలంగా చిరుత సంచారంతో భయపడిపోతున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో