హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనంపై ఆంక్షలు: కేసీఆర్ సర్కార్ తర్జన భర్జన

By narsimha lodeFirst Published Sep 14, 2021, 10:33 AM IST
Highlights

హైద్రాబాద్ ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చిస్తోంది. ఈ విషయమై హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది. మరో వైపు హుస్సేన్ సాగర్ లోనే వినాయక విగ్రహల నిమజ్జనం చేస్తామని గణేష్ ఉత్సవ సమితి తేల్చి చెప్పింది.

హైదరాబాద్:  హైద్రాబాద్‌ ట్యాంక్‌బండ్ హుస్సేన్‌సాగర్  వినాయక విగ్రహల  నిమజ్జనంపై  హైకోర్టు ఆంక్షలు విధించడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా పరిశీలిస్తోంది.ట్యాంక్బండ్ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాలతో పాటు దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఈ నెల 9వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రివ్యూ పిటిషన్ ను కూడ తెలంగాణ హైకోర్టు ఈ నెల 13వ  తేదీన కొట్టివేసింది.   ఈ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులతో ప్రగతి భవన్ లో  సోమవారం నాడు సమీక్షించారు.

తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో ఇవాళ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గణేష్ ఉత్సవ సమితితో పాటు ఆయా గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

also read:వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు తీర్పు: సుప్రీంకి వెళ్లే యోచనలో కేసీఆర్ సర్కార్

హుస్సేన్‌సాగర్ లో నిమజ్జనం చేయకుండా అడ్డుకొంటే రోడ్లపైనే వినాయక విగ్రహలను నిమజ్జనం చేస్తామని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి తేల్చి చెప్పింది. ఈ తరుణంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. ఈ విషయమై  తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా పరిశీలిస్తోంది. హుస్సేన్ సాగర్ కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటల్లో వినాయక విగ్రహలను నిమజ్జనం చేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. 

click me!