భద్రాచలంలో చెత్తకుప్పలో చిన్నారి.. ఆడపిల్ల పుట్టిందని అమానుషం... !

Published : Sep 14, 2021, 10:32 AM IST
భద్రాచలంలో చెత్తకుప్పలో చిన్నారి.. ఆడపిల్ల పుట్టిందని అమానుషం... !

సారాంశం

భద్రాచలంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్త కుప్పలో వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. భద్రాచలం పట్టణంలోని బస్ స్గాండ్ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర హోటల్ పక్క సందులో ఓ చెత్తకుప్ప ఉంది. ఆ చెత్తకుప్పల్లోంచి చిన్నారి ఏడుపులు వినిపిస్తుండడంతో స్థానికులు గమనించారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అభంశుభం తెలియని పసిగుడ్డును ఆడపిల్ల అనే కారణంతో చెప్పకుప్పల్లో పడేసి వెళ్లారు దుర్మార్గులు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 

భద్రాచలంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్త కుప్పలో వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. భద్రాచలం పట్టణంలోని బస్ స్గాండ్ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర హోటల్ పక్క సందులో ఓ చెత్తకుప్ప ఉంది. ఆ చెత్తకుప్పల్లోంచి చిన్నారి ఏడుపులు వినిపిస్తుండడంతో స్థానికులు గమనించారు. 

వెంటనే చిన్నారిని చేరదీసిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఆ చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆడపిల్ల కావడంతోనే వదిలి వెళ్లినట్లు స్తానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని, చిన్న చిన్న గాయాలు అయినట్లు వెైద్యులు తెలిపారు. 

కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాపను చెత్తకుప్పలో ఎవరు వదిలి వెళ్లారు? ఎందుకు వదిలిపెట్టారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu
హైదరాబాద్ కు 50 కి.మీ దూరంలో మరో కూకట్ పల్లి.. ఇక్కడ రూ.40-50 లక్షలకే ఇండిపెండెంట్ హౌస్, భవిష్యత్ లో అయితే కోట్లు..!