తెలంగాణ బడ్జెట్ 2023-24 : విద్యకు రూ. 19 వేల కోట్లు, మౌలిక వసతులకు ప్రాధాన్యత

By narsimha lode  |  First Published Feb 6, 2023, 12:15 PM IST

తెలంగాణ ప్రభుత్వం  ఈ ఏడాది బడ్జెట్ లో  విద్యరంగానికి  రూ.  19, 093 కోట్లు కేటాయించింది.  గురుకులాలతో పాటు  ప్రభుత్వ స్కూళ్లలో  మౌలిక వసతుల కల్పనకు  నిధులిచ్చింది.  


హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం  విద్యా సంస్థలు, గురుకులాల్లో మౌళిక వసతుల కల్పనకు   బడ్జెట్ లో  ప్రాధాన్యత ఇచ్చింది.   విద్యా వ్యవస్థను బలోపేతం  చేసేందుకు రాస్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.   రాష్ట్ర బడ్జెట్ లో  విద్యా రంగానికి  ప్రభుత్వం  రూ. 19, 093 కోట్లు కేటాయించింది. 

తెలంగాణ ప్రభుత్వం  గురుకుల విద్యకు  అధిక ప్రాధాన్యత ఇస్తుంది.  ప్రతి ఏటా  గురుకులాలపై  బడ్జెట్ లో  నిధులను పెంచుకుంటూపోతుంది.  తెలలంగాణ రాష్ట్రం ఏర్పాటైన  సమయంలో రాష్ట్రంలో ని 293 గురుకుల పాఠశాల్లో  అరకొర వసతులు మాత్రమే ఉండేవి. ఈ గురుకుల పాఠశాలల్లో  వసతులను పెంచేందుకు  ప్రభుత్వం  నిధులను  ఖర్చు పెంచుకుంటూ  పోతుంది.  రాష్ట్రంలో ప్రస్తుతం  గురుకులాల సంఖ్య  1,002కి చేరుకుంది.  ఈ స్కూళ్లలో   5 లక్షల 59 వేల మంది  విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. 2014 లో  గురుకులాలపై  తెలంగాణ ప్రభుత్వం  రూ.784 కోట్లు ఖర్చు పెట్టింది.  2022-23 నాటికి  బడ్జెట్  కేటాయింపులు  రూ. 3400 కోట్లకు  పెంచింది.  

Latest Videos

రాష్ట్రంలోని  అన్ని ప్రభుత్వ స్కూళ్లలో  మన ఊరు మన బడి కార్యక్రమాన్ని  ప్రభుత్వం  చేపట్టింది. ప్రభుత్వ స్కూళ్లలో  మౌలిక వసతుల కల్పనే ఈ పథకం ఉద్దేశం.  రాష్ట్రంలోని 26,065 స్కూళ్లలో   మౌలిక వసతులను మూడు దశల్లో మెరుగుపర్చనున్నారు. తొలి దశలో  9,123 స్కూళ్లలో  రూ. రూ. 3,497 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ది  చేస్తారు.

రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల్లో  మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం  రూ. 500 కోట్లు కేటాయించింది.  ఇంగ్లీష్ మీడియంలో  బోధనకు వీలుగా  టీచర్లకు   ట్రైనింగ్  ఇప్పించనుంది ప్రభుత్వం.

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో  ఇంటర్  చదివిన విద్యార్ధుల కు   ఎంసెట్,  ఐఐటీ జేఈఈ  వంటి  ప్రవేశ పరీక్షలకు  ప్రభుత్వం ఉచితంగా  కోచింగ్  ఇవ్వనుంది. ఈ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ల కాలంలో  రాష్ట్ర వ్యాప్తంగా  కొత్తగా  14 పాలిటెక్నిక్ కాలేజీలను  ఏర్పాటు  చేసింది . మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్ధులకు  సన్న బియ్యం కూడా అందిస్తుంది. 
 

click me!