
హైదరాబాద్: గత ఏడాదితో పోలిస్తే సుమారు 33వేల 438 కోట్లు ఎక్కువగా ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం .తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు వరుసగా నాలుగో సారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 2022-23 ఏడాదిలో 2,56, 958 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. 2023-24 లో 2,90, 396 కోట్లతో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. గత ఏడాది వ్యవసాయానికి రూ. 24, 254 కోట్లు, దళిత బంధుకు రూ.17,700 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.