2023-24 తెలంగాణ బడ్జెట్: వ్యవసాయానికి అధిక కేటాయింపులు

By narsimha lodeFirst Published Feb 6, 2023, 11:51 AM IST
Highlights

తెలంగాణ బడ్జెట్ లో  రాష్ట్ర ప్రభుత్వం  గతంతో పోలిస్తే  వ్యవసాయానికి  బడ్జెట్ లో  అధికంగా  నిధులు   కేటాయించింది

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ లో  రాష్ట్ర ప్రభుత్వం గతంతో పోలిస్తే వ్యవసాయానికి  కేటాయింపులు పెంచింది.  గత ఏడాది వ్యవసాయానికి రూ. 24, 254 కోట్లు  కేటాయించింది  ప్రభుత్వం. ఈ దఫా బడ్జెట్ లో రూ. 26,831  కోట్లు కేటాయించింది . 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  తెలంగాణ ప్రాంతంలో  వ్యవసాయ రంగంపై  కేవలం  రూ. 7,994 కోట్లు ఖర్చు  చేస్తే 2014 నుండి  ఇప్పటివరకు  రాష్ట్ర ప్రభుత్వం  రూ.  1.91, 612 కోట్లు  ఖర్చు చేసింది.  ఉమ్మడి రాష్ట్రంలో  కంటే  20 రెట్లు అధికంగా  తెలంగాణ ప్రభుత్వం  ఖర్చు  చేసింది .
 వ్యవసాయానికి ఉచితంగా  24 గంటల విద్యుత్,  రైతులకు  పెట్టుబడి సహయం,  వంటి  అనేక  పథకాలు రాష్ట్రం అమలు చేస్తుంది.  

దేశంలో  వ్యవసాయ వృద్ధి రేటు  4 శాతంగా  ఉంటే  తెలంగాణలో మాత్రం వ్యవసాయ వృద్ది రేటు  7.4 శాతానికి  చేరింది.  తెలంగాణ ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, సాగు  మిషన్ కాకతీయ  వంటి కార్యక్రమాలతో  సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. 

2014-15  లో సాగు విస్తీర్ణం 131,33 లక్షల ఎకరాలు.2020-21 నాటికి సాగు విస్తీర్ణం  215. 37 లక్షలకు  చేరుకుంది.  రాష్ట్ట్రంలో  వరి ఉత్పత్తి  మూడు రెట్లు పెరిగింది.  2014-15 లో 68.17 లక్షల మెట్రిక్ టన్నుల నుండి  2020-21 నాటికి  2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్ను కు పెరిగింది.

రైతు బంధు పథకం కింద  65 లక్షల మంది రైతులకు  65 వేల  కోట్ల పెట్టుబడి  అందించిన  రాష్ట్రం తెలంగాణ.  ఎనిమిదేళ్ల కాలంలో రైతు పండించిన  ప్రతి ధాన్యం గింజను  కొనుగోలు  చేసినట్టుగా   ప్రభుత్వం తెలిపింది.  2014-15 లో  2.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది.2022-23 నాటికి   65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం  సేకరించినట్టుగా  ప్రభుత్వం తెలిపింది . రైతుల నుండి కొనుగోలు  చేసిన ధాన్యానికి  ప్రభుత్వం వెంటనే  డబ్బులను  అందిస్తుంది. 
 

click me!