గెలిచే ధైర్యం లేకే పరకాలకు పారిపోయారు: కొండాపై కడియం ఘాటు వ్యాఖ్యలు

Published : Oct 01, 2018, 11:00 AM IST
గెలిచే ధైర్యం లేకే పరకాలకు పారిపోయారు: కొండాపై కడియం ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో  గెలిచే ధైర్యం లేకనే కొండా దంపతులు పరకాలకు  పారిపోయారని  డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి  తీవ్రంగా విమర్శించారు


వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో  గెలిచే ధైర్యం లేకనే కొండా దంపతులు పరకాలకు  పారిపోయారని  డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి  తీవ్రంగా విమర్శించారు.  కొండా దంపతులు  పరకాలకు వెళ్లడంతో  వరంగల్ తూర్పు నియోజకవర్గానికి పట్టిన  పీడ విరగడైందన్నారు.  తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిని కలిసికట్టుగా  గెలిపించుకొంటామని  ఆయన  ధీమాను వ్యక్తం చేశారు.

ఆదివారం శివనగర్‌లోని సాయి కన్వెన్షన్‌హాల్‌లో ఎంపీలు, కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగున్నర సంవత్సరాలుగా కొండా సురేఖ నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయలేదన్నారు. కార్పొరేటర్లను కనీస విలువ ఇవ్వకుండావారిని అగౌరవపర్చారని కడియం  గుర్తు చేశారు.
 
ఆరు నెలలనుంచి కొండా దంపతులు ప్రవర్తనను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటి జాబితాలో పేరు ప్రకటించలేదన్నారు. దీంతో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌పై అవాకులు, చవాకులు పేలారని అన్నారు.

పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారని కడియం శ్రీహరి ధీమాను వ్యక్తం చేశారు. తూర్పులో అధిష్ఠానం ఎవరిని నిలిపినా తాము భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. వరంగల్‌ తూర్పులో కొండా ప్రభావం ఏమీ లేదని, 21 మంది కార్పొరేటర్లు తమవైపే ఉన్నారని అన్నారు. 

సంబంధిత వార్తలు

ఆ స్థానాల్లో టీఆర్ఎస్‌కు చుక్కలు చూపుతాం: కొండా సురేఖ

6 నియోజకవర్గాల్లో కాదు కదా.. 6 డివిజన్లలో కూడా.. కొండాకు అంత సీన్ లేదు

సత్తా చూపుతాం: కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు

కొండా దంపతులు.. అందుకే అలా మాట్లాడుతున్నారు..వినయ్

దొరల కింద బతికేవాళ్లం కాదు.. సురేఖను లక్ష మెజారిటీతో గెలిపిస్తా: కొండా మురళీ

15 పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొండా సురేఖ..?

నేను హరీశన్న వర్గం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

PREV
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?