నా మీద విచారణ జరపండి.. రూ.900 కోట్లు సంపాదించడం సాధ్యమేనా: పుట్టా మధు

By sivanagaprasad kodatiFirst Published Oct 1, 2018, 10:47 AM IST
Highlights

టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆస్తులపై.. మంథనీ ఉప సర్పంచ్ చేసిన ఆరోపణలపై.. మధు స్పందించారు. దీనిపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక పేద బిడ్డ ఎమ్మెల్యే స్థాయికి ఎదగడం చూసి ఓర్వేలేకపోతున్నారు

టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆస్తులపై.. మంథనీ ఉప సర్పంచ్ చేసిన ఆరోపణలపై.. మధు స్పందించారు. దీనిపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక పేద బిడ్డ ఎమ్మెల్యే స్థాయికి ఎదగడం చూసి ఓర్వేలేకపోతున్నారు.. మళ్లీ గెలవకూడదని కుట్రలు,కుతంత్రాలు పన్నుతున్నారు.

తాను ఎమ్మెల్యేగా పనిచేసిన మూడు నెలలో రూ.900 కోట్లు సంపాదించానంటున్నారు. అంటే రోజుకు రూ.50 లక్షలు.. నెలకు రూ.15 కోట్లు.. ఇది ఏ ప్రజా ప్రతినిధికైనా సాధ్యమేనా..? తనను రాజకీయంగా ఎదుర్కొలేకే కాంగ్రెస్ నాయకులు... ఇలాంటి ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారని మధు ఆవేదన వ్యక్తం చేశారు.

తన ఆస్తులు, సంపాదనపై విచారణ జరిపాల్సిందిగా  హైకోర్టు చీఫ్ జస్టిస్, ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌కు తానే స్వయంగా లేఖ రాస్తున్నట్లు స్పష్టం చేశారు. మంధని ఆంధ్రా బ్యాంకుకు బాంబు పెడుతూ దొరికిపోయి... ఇక్కడి వ్యాపారులను బెదిరిస్తూ.. దోపిడిదారుగా పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉన్నవారు.... తనపై అసత్య ఆరోపణలు చేస్తుంటే.. ఆధారాలు అడగకుండా హైలెట్ చేయడం మీడియాకు తగదని పుట్టా మధు వ్యాఖ్యానించారు. తనపై ఆరోపణలకు సంబంధించి మీడియా ముందు సాక్ష్యాలు చూపిస్తే.. జైలుకు పోతానన్నారు. 

click me!