‘‘కంటి వెలుగు’’ బాధితులను పరామర్శించిన టీడీపీ నేతలు

Published : Oct 01, 2018, 10:46 AM IST
‘‘కంటి వెలుగు’’ బాధితులను పరామర్శించిన టీడీపీ నేతలు

సారాంశం

అలా కంటి వెలుగు పథకం ద్వారా కంటి ఆపరేషన్ చేయించుకున్న కొందరికి.. వైద్యం వికటించింది.

తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం ‘‘కంటి వెలుగు’’. ఈ పథకం ద్వారా కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి.. వారికి కళ్లజోళ్లు అందజేశారు. అంతేకాకుండా.. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి  కంటి ఆపరేషన్లు కూడా చేయించారు. అయితే.. అలా కంటి వెలుగు పథకం ద్వారా కంటి ఆపరేషన్ చేయించుకున్న కొందరికి.. వైద్యం వికటించింది.

వరంగల్ జిల్లాలో వైద్యం వికటించిన బాధితులు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఆ బాధితులను తెలంగాణ టీడీపీ నేతలు పరామర్శించారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ చాడ వెంకటరెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్ది దరెడ్డి, టీడీపీ జాతీయ     అధికార ప్రతినిధి అరవింద్ కుమార్, టీడీపీ రాష్ట్ర నాయకులు బుచ్చిలింగం, శోభరాణి, బీఎన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, అనుష, దీపక్ రెడ్డి, రమేష్, శ్రీకాంత్ తదితరులు బాధితులను పరామర్శించి.. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?