ఇది ఎడారిలో పారుతున్న తెలంగాణా వేదన

Published : Dec 29, 2016, 10:34 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ఇది ఎడారిలో పారుతున్న తెలంగాణా వేదన

సారాంశం

వీళ్ల కోసం ఒక చుక్క కన్నీరు రాల్చండి.. ఒక  గల్ఫ్ ప్రవాసి  నెమరేసుకున్న వేదనను ఉన్నదున్నట్లు అందిస్తున్నాం

మనిషి అన్నవాడు తన కోసం కాకుండా తన వాల్ల కోసం ఎంతటి కష్టాన్నైనా చేయడానికి సిద్ధ పడతాడు.


ఊర్లల్లో అందరం చూస్తుంటాం, చాలా మంది అంటుంటారు..

మీవాడు దుబాయి వెళ్ళాడు నీకేంటమ్మ! వాడు నెల నెల డబ్బులు పంపిస్తున్నడు నీకేం అని కదా ..........!


కానీ మేము ఇక్కడ పడే కష్టాలు ఎవరికీ కనపడవు ఎవరు చెప్పుకోరు 


కానీ మనవాళ్ళు గల్ఫ్ లో ఎలావుంటారు....?.


ఏం చేస్తారు, కష్టాలు ఏంటి ..............?


ఇంట్లో మనం ప్రోద్దున 6 గంటలకు లేవాలంటే చాల కష్టం

కానీ మేము ఇక్కడ మబ్బుల 04:30 గంటలకి లేచి రెడీ అయ్యి టిఫీన్ తీసుకొని బస్సు ఎక్కివెళ్ళాలి

బస్సు మిస్ అయిన్దా, ఒకరోజుకు రెండు రోజుల జీతం కట్.

కంపెనీ వాళ్ళు చెప్పిన పని చేయాలి .....

గల్ఫ్ లో అడుగుపెట్టమా ఒకరికింద అణిగి బ్రతకడమే.......

కానీ కష్టాన్ని కూడా నవ్వుతు పనిచేయడంమే మనవాళ్ళ యొక్క గొప్పదనం

ఒకరికి ఒకరు సహాయపడుతూ కాలాన్ని గడిపేస్తుంటారు

 

పనిలో వుండగా దొరికిన కాసింత సమయాన్ని కబుర్ల తో గడుపుతారు
ఇంటినుండి వలస వచ్చిన ఇక్కడకూడా వలస వెళ్ళాల్సి వుంటుంది, 
పనికోసం రోజులవారిగా ప్రాంతాలు మారాలి...


ఇంటికాడ తిన్న పళ్ళెం కూడా కుసున్న కాడినుంచి తియ్యక పోదుము కాని ఇక్కడ తినలంటే తలా ఒక చెయ్యి వేసి వండుకోవాల్సిందే.

తిన్న తరువాత రేపటికి ప్లాస్టిక్ కవర్ల సద్ది కట్టుకోవాలె ..

 

రాతిరి అయ్యేసరికి కాసింత కాలక్షేపం....
కానీ ఒక్కోసారి భరించలేనిది బాధ మనవాళ్ళు గుర్తురావడం కలలో తప్ప కల్లనిండుగా చూడలేకపోవడం,

 

కన్నీళ్ళతో మనల్ని మనం ఓదార్చుకోవడం..
కానీ చివరగా ఒక్కరోజు హ్యాపీగా అందంగా వుండే రోజు, మా ఫ్లైట్ టికెట్ మా చేతికి వచ్చిన రోజు
ఇంటికి వెళ్తున్న అని మాకు తెలిసిన రోజు.


మన వాళ్ళని మా కళ్ళతో చుసిన రోజు మల్ల అప్పుడు మా కళ్ళలో నిజమైన ఆనందం వచ్చిన రోజు.

ఇది గల్ఫ్ జీవితం..

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?