ఆ బాలుడి మృతిపై ‘తెలంగాణ’కు మొట్టికాయలు

Published : Dec 28, 2016, 03:05 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఆ బాలుడి మృతిపై ‘తెలంగాణ’కు మొట్టికాయలు

సారాంశం

ప్రభుత్వానికి హెచ్ ఆర్ సీ నోటీసులు

 

ఇటీవల నల్లగొండ జిల్లా ఈదులూరు ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు సాంబారు పాత్రలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే.

 

ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సీరియస్ అయింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని బుధవారం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

 

ఆరు వారాల్లోగా తమకు బాలుడి మృతిపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.

 

గత శుక్రవారం ఐదేళ్ల బల్కూరి జయవర్ధన్ మధ్యాహ్న భోజనం సమయంలో ప్రమాదవశాత్తు వేడి సాంబారు ఉన్న పాత్రలో పడిపోయాడు.

 

దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్క లేదు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?