కోదండరామ్ మీద కొరడా ఝళిపించిన కెసిఆర్

Published : Dec 29, 2016, 07:46 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
కోదండరామ్ మీద కొరడా ఝళిపించిన కెసిఆర్

సారాంశం

కొత్త  జెఎసి ఆర్మీతో  ఉద్యమించాలనుకుంటున్న కోదండరామ్ కు ఇక ముందన్నీ కష్టాలే...

బయట తెలంగాణాలో ఎంత జరుగుతున్నా, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు  మాత్రం మౌనంగానే  ఉంటూన్నారు.

 

ఆయన ఇంతవరకు కోదండరామ్ ని గాని, కోదండరామ్ తలపెట్టిన మరో తెలంగాణా ఉద్యమాన్ని గాని ఏమీ అనలేదు.

 

అయితే,  ఇపుడు చప్పుడు చేయకుండా కొరడా  ఝళింపించారు.

 

కోదండరామ్ తలపెట్టిన భూనిర్వాసితుల నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి నీయలేదు. ఫలితంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. పోలీసుల చర్యకు నిరసనగా  తార్నాక లోని తన ఇంట్లో తానే నిరసన తెలిపాల్సి వచ్చింది.  ఈ మధ్యాహ్నం  ఆయన దీక్షకు దిగారు. గురువారం నాటి నిరసన ప్రదర్శన నేపథ్యంలో రాష్ట్ర వ్యాపితంగా కోదండరామ్ సైనికులను పోలీసులు అరెస్టు చేశారు.

 

తెలంగాణా వచ్చాక జెఎసితో పనేముందని టిఆర్ఎస్ ప్రకటించాక, ఇందులో నుంచి చాలా ఉద్యోగ సంఘాలు బయటకు వెళ్లిపోయాయి. ఇక టిజెఎసి మూత పడుతుందని ఏలినవారి నమ్మకం. అయితే, కోదండ రామ్ కొత్త ఆర్మీని రిక్రూట్ చేసుకుని టిజెఎసిలను రాష్ట్ర వ్యాపితంగా పునర్వ్యవస్థీకరించి తగిన జవాబిచ్చారు. ఈ కొత్త సైన్యంతో ఆయన భూనిర్వాసితుల పోరాటం మొదలుపెట్టాలని చూశారు. ఇక ముందన్నీ పోరాటలే అనే  ఇంప్రెషన్ ఇచ్చారు.

 

అయితే, అసెంబ్లీలో బిల్లు కూడా పాసయ్యాక ఉద్యమం లేదు,గిద్యమం లేదని పోలీసు ఇందిరాపార్క్ నిరసనకు అనుమతి నిరాకరించారు. ముందు రోజు రాత్రి నుంచే టిజాక్ నేతలందరిని అరెస్టు చేసేశారు.

 

దీనితో నేటి భూనిర్వాసితుల నిరసన కార్యక్ర మాన్ని వాయిదా వేసుకుని ఆయన తన నివాసం లో నిరసనదీక్షకు కూర్చున్నారు.

 

దీక్షను రద్దు చేసుకున్నట్లు ప్రకటించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా, అన్నిఙిల్లాలలో వందలాది  ఙేయేసీ నాయకులను పోలీసులు అక్రమంగా నిర్భంధించడాన్ని ఆయన ఖండించారు. జెఎసి  నాయకుల ఇండ్లపై తెల్లవార్లూ దాడులు నిర్వహించి అరెస్టులపర్వం కొనసాగించారు.

 

చట్ట విరుద్ధమైన పోలీసుల నిర్బంధం,  తెలంగాణ ప్రభుత్వం  అమలుఙరుపుతున్న దమనకాండను  ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ చర్యలను ఖండించాలని ప్రజలను,  ప్రఙాస్వామికవాదులకు,  పౌరసమాజానికి టిజెఎసి పిలుపు నిచ్చింది.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?