హరీశ్ రావు అంటే కాంగ్రెస్ కు ఎంత అభిమానమో

First Published Apr 20, 2017, 2:02 PM IST
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హరీశ్ నాయకత్వమే  కావాలని కోరుకుంటున్నారు : తెలంగాణా కాంగ్రెస్

నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును  టీఆర్ఎస్ లో ఏకాకిని చేశారని కాంగ్రెస్ నాయకుడు మాజీ కేంద్ర  మంత్రిసర్వే సత్యనారాయణ ఎంతగానో ఆవేదన చెందారు.

అయనే కాదు,  కౌన్సిల్ ప్రతిపక్షనాయకుడ షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా హరీశ్ రావు ఎనలేనిసానుభూతి చూపించారు. ఆయనకు మద్దతు ప్రకటించారు.

అసలు తెలంగాణా ఉద్యమం నడిపిందంతా హరీశేనని వారు చెప్పారు.

హరీశ్ తెలంగాణా ఉద్యమంలో పాల్గొంటే, తీరా రాష్ట్రం వచ్చాక, అమెరికా నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్  కొడుకు బిడ్డా ఊడిపడ్డారు.

హరీష్ కు కష్టపడే తత్వం ఉంది. హరీష్ కు రెండేళ్లే టైం ఉంది,’వారు అన్నారు.

టీఆర్ఎస్  ఎమ్మెల్యేలంతా హరీశ్ నాయకత్వమే  కావాలని కోరుకుంటున్నారని వారు అన్నారు. చివర్లో మరీ రెచ్చిపోయి ఇదిగో ఈ సలహా ఇచ్చారు.

‘మామను వెన్నుపోటు పొడుస్తావో...ఏం చేస్తావో ఇప్పుడే చేయ్ హరీశన్నా.2019 లో కాంగ్రెస్ వస్తుంది, ’ అని హరీశ్ కు అభయమిచ్చారు. రెండురోజుల కిందట జగిత్యాల మాట్లాడుతూ కెటిఆర్‘ హరీశ్ రావు కాంగ్రెస్ లోకి వెళ్లడు,’ అన్నప్పటినుంచి కాంగ్రెస్ నాయకులు  ఇలా దాడి ప్రారంభించారు.

’గులాబీ కూలీ‘ అనేది లంచం తీసుకోవడంలో కొత్త విధానమని వారు విమర్శించారు.

కూలీ అయిదు లక్షలు వస్తే పన్ను కడుతున్నారా?

అవి ఏ లెక్కలో చూపుతున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు.    

కుటుంబ వారసత్వ రాజకీయాల వల్ల హరీశ్ రావు డౌన్ అయ్యారని, ఇలా గే ఉంటే జీవిత కాలంలో ఆయన ముఖ్యమంత్రి కాలేరని సంగరెడ్డి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు.                   

 

 

click me!