నోరూరిస్తున్న ‘టీఆర్ఎస్ ప్లీనరీ’

Published : Apr 20, 2017, 10:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
నోరూరిస్తున్న ‘టీఆర్ఎస్ ప్లీనరీ’

సారాంశం

హైదరాబాదీ దమ్ బిర్యానీ, హైదరాబాదీ మటన్, దమ్ కా చికెన్, ముర్రెల్ ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, గుడ్డు పులుసు, మిర్చి కా సలాన్, మటన్ శెర్వా, ప్లమ్ కేక్ ఐస్ క్రీం,పైన్ యాపిల్ ఫెర్నీ స్వీట్ ఇలా దాదాపు 30 రకాల వంటలకాలను మెనూలో చేర్చినట్లు తెలిసింది.

అధికార టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం నాడు ప్లీనరీ సమావేశాలను నిర్వహించనున్న విషయం తెలిసిందే.  దీనికి హాజరయ్యే అతిథులు, పార్టీ కార్యకర్తలకు ఏర్పాటు చేసిన విందు నోరూరిస్తుంది. దాదాపు 30 రకాల తెలంగాణ వంటలతో గులాబీ మీటింగ్ అంతా గుమగుమలాడిపోతోంది.

హైదరాబాదీ దమ్ బిర్యానీ, హైదరాబాదీ మటన్, దమ్ కా చికెన్, ముర్రెల్ ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, గుడ్డు పులుసు, మిర్చి కా సలాన్, మటన్ శెర్వా, ప్లమ్ కేక్ ఐస్ క్రీం,పైన్ యాపిల్ ఫెర్నీ స్వీట్ ఇలా దాదాపు 30 రకాల వంటలకాలను మెనూలో చేర్చినట్లు తెలిసింది.

శాఖాహారులకు, మాంసాహారులకు ప్రత్యేకంగా మెనూను సిద్ధం చేసినట్లు ప్లీనరీ పర్యవేక్షకులు చెప్పారు. పంపుచారు, పచ్చిపులుసు వంటి సాధారణ తెలంగాణ వంటకాల నుంచి ఫైన్ యాపిల్ ఫెర్నీ వంటీ స్వీట్ల వరకు అతిథులకు ప్రత్యేకంగా వడ్డించనునట్లు కేటరింగ్ నిర్వహకులు తెలిపారు.

1500 మంది కి సరిపోయేలా వంటకాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఆరు డైనింగ్‌ ఏరియాల్లో  విందు భోజనం వడ్డించడానికి ఏర్పాట్లు చేశామన్నారు.

PREV
click me!

Recommended Stories

Jabardasth Anchor Rashmi Gowtham Pressmeet: మీ సంస్కృతి అంతా మా బట్టలపైనే ఉంది| Asianet News Telugu
Harish Rao Comments on Revanth Reddy:టెండర్లురద్దు చేసి సిబిఐవిచారణ జరిపించాలి | Asianet News Telugu